ఇంతటగాని నీపగ టిందరూ నెరఁగరా
(॥పల్లవి॥)
ఇంతటగాని నీపగ టిందరూ నెరఁగరా
వింతవారు చూచి యిది యెంత రాఁగనరా
(॥॥)
చిక్కనితేనెలు గార చెలువుఁడు నోరూర
మక్కళించి యెటువంటి మాటలాడేవే
జక్కవ చన్నులు నీవు సారెఁ గదలించుకొంటా
నుక్కుమీర నెంతేసిపూడిగాలు సేసేవే
(॥॥)
కొప్పులో పువ్వులు రాల కుచ్చులపయ్యద వేల
ఇప్పుడే యీతనికొలు వేమిసేసేవే
చప్పుడుగా మీఁదమీఁదఁ జవులుగా సెలవుల-
నప్పటి వేసటలేక యదేల నవ్వేవే
(॥॥)
చెమట చెక్కుల మించ శ్రీవేంకటేశుఁ డాలించ
భ్రమయించి యెందాఁకాఁ బాటవాడేవే
అమరఁ గూడితి నేనే అలమేల్మంగ నాపేరు
తమి నాతని నీవెంత తతిఁ గాఁగిలించేవే
(||pallavi||)
iṁtaḍagāni nībaga ṭiṁdarū nĕram̐garā
viṁtavāru sūsi yidi yĕṁta rām̐ganarā
(||||)
sikkanidenĕlu gāra sĕluvum̐ḍu norūra
makkaḽiṁchi yĕḍuvaṁṭi māḍalāḍeve
jakkava sannulu nīvu sārĕm̐ gadaliṁchugŏṁṭā
nukkumīra nĕṁtesibūḍigālu seseve
(||||)
kŏppulo puvvulu rāla kuchchulabayyada vela
ippuḍe yīdanigŏlu vemiseseve
sappuḍugā mīm̐damīm̐dam̐ javulugā sĕlavula-
nappaḍi vesaḍalega yadela navveve
(||||)
sĕmaḍa sĕkkula miṁcha śhrīveṁkaḍeśhum̐ ḍāliṁcha
bhramayiṁchi yĕṁdām̐kām̐ bāḍavāḍeve
amaram̐ gūḍidi nene alamelmaṁga nāberu
tami nādani nīvĕṁta tadim̐ gām̐giliṁcheve