Imtada nunnaara midiye saalunu

ఇంతట నున్నార మిదియె చాలును
Language

(॥పల్లవి॥)
ఇంతట నున్నార మిదియె చాలును
యెంతసేసినా నెఱిఁగేవా

(॥ఇంత॥)
నాలుకచూపులు వసమై యాకెకు
కేలుచాఁచి తమకించేవు
యెలాగులు సే మెట్లఁ బొదిగినా
మేలేలనుచు మెచ్చేవా

(॥ఇంత॥)
పిలుకుఁదేనేలకు భ్రమసి యాపెకును
వలచి నీశిరసు వంచేవు
పిలిచి నే మినుడు ప్రియములు చెప్పిన
తలఁపులోపలను తగిలీనా(లేవా?)

(॥ఇంత॥)
నిండుఁగాఁగిటను నిలిచి యాపెతో
అండనె సరసములాడేవు
పండె శ్రీవేంకటపతి నాభాగ్యము
దండిగఁ గూడితి తనిసేవా

(||pallavi||)
iṁtaḍa nunnāra midiyĕ sālunu
yĕṁtasesinā nĕṟim̐gevā

(||iṁta||)
nālugasūbulu vasamai yāgĕgu
kelusām̐si tamagiṁchevu
yĕlāgulu se mĕṭlam̐ bŏdiginā
melelanusu mĕchchevā

(||iṁta||)
pilugum̐denelagu bhramasi yābĕgunu
valasi nīśhirasu vaṁchevu
pilisi ne minuḍu priyamulu sĕppina
talam̐pulobalanu tagilīnā(levā?)

(||iṁta||)
niṁḍum̐gām̐giḍanu nilisi yābĕdo
aṁḍanĕ sarasamulāḍevu
paṁḍĕ śhrīveṁkaḍabadi nābhāgyamu
daṁḍigam̐ gūḍidi tanisevā