ఇంతట మెచ్చఁగదవే ఇద్దరూ మీరు
(॥పల్లవి॥)
ఇంతట మెచ్చఁగదవే ఇద్దరూ మీరు
మంతనానఁ గూడితిరి మచ్చిక దైవారను
(॥ఇంత॥)
తరుణి నామాట నీకు తారుకాణ వచ్చెనా
సిరుల నీఇంటికి విచ్చేసె నితఁడు
సరుగ నీమనసుకు సంతోసమాయనా
మరిగి నిన్నిన్నిటాను మన్నించె నితఁడు
(॥ఇంత॥)
సాకిరి నేఁ బెట్టినట్టె సరివచ్చెనా నేఁడు
మేకొని యీతఁడు నీక మేలువాఁడాయ
యీకడ నీ కోరికలు యింతట నీడేరెనా
చేకొని నీ చెప్పినట్టె సేసె నిదె యీతఁడు
(॥ఇంత॥)
నే నిచ్చిన నమ్మికలు నీకు నీడువచ్చెనా
పూని శ్రీవేంకటేశఁ డిప్పుడు గూడెను
తానకమై మీపొందులు తగులము లాయనా
నానారీతుల నీతో ననిచినాఁ డీతఁడు
(||pallavi||)
iṁtaḍa mĕchcham̐gadave iddarū mīru
maṁtanānam̐ gūḍidiri machchiga daivāranu
(||iṁta||)
taruṇi nāmāḍa nīgu tārugāṇa vachchĕnā
sirula nīiṁṭigi vichchesĕ nidam̐ḍu
saruga nīmanasugu saṁtosamāyanā
marigi ninninniḍānu manniṁchĕ nidam̐ḍu
(||iṁta||)
sāgiri nem̐ bĕṭṭinaṭṭĕ sarivachchĕnā nem̐ḍu
megŏni yīdam̐ḍu nīga meluvām̐ḍāya
yīgaḍa nī korigalu yiṁtaḍa nīḍerĕnā
segŏni nī sĕppinaṭṭĕ sesĕ nidĕ yīdam̐ḍu
(||iṁta||)
ne nichchina nammigalu nīgu nīḍuvachchĕnā
pūni śhrīveṁkaḍeśham̐ ḍippuḍu gūḍĕnu
tānagamai mībŏṁdulu tagulamu lāyanā
nānārīdula nīdo nanisinām̐ ḍīdam̐ḍu