Imta vubagaari naidi nidi neegum jaaladaa

ఇంత వుపకారి నైతి నిది నీకుఁ జాలదా
Language

(॥పల్లవి॥)
ఇంత వుపకారి నైతి నిది నీకుఁ జాలదా
బంతిఁబెట్టితి వలపు భావించుకో తగవు

(॥ఇంత॥)
ఆలరి యాపె దిట్టిన ఆ తిట్లల్లా దాఁచి
జాలిఁ బెట్టనైతి నిన్ను చాలదా ఇది
పోలించి నీవు బొంకిన బొంకులెల్లా చెల్లఁ బెట్టి
మేలు మేలని మెచ్చితి మెచ్చవద్దా నన్నును

(॥ఇంత॥)
చివుకున ఆపెచేసే సేఁతలకు నడ్డమై
చవుకలు సేయనైతి చాలదా యిది
తవిలి నీవు దలఁచే తలఁపెల్లా నీడేరించి
కవ గూర్చినందుకు చొక్కఁగవద్దా మనసు

(॥ఇంత॥)
కలశాపె నవ్వఁగాను కాఁగిలించుకొని నిన్ను
చలములు మించి(చ)నైతి చాలదా ఇది
నిలిచి శ్రీ వేంకటేశ నెరవేర్చి నీపనులు
బలిమి సేసితిని చేపట్టవద్దా యిఁకను

(||pallavi||)
iṁta vubagāri naidi nidi nīgum̐ jāladā
baṁtim̐bĕṭṭidi valabu bhāviṁchugo tagavu

(||iṁta||)
ālari yābĕ diṭṭina ā tiṭlallā dām̐si
jālim̐ bĕṭṭanaidi ninnu sāladā idi
poliṁchi nīvu bŏṁkina bŏṁkulĕllā sĕllam̐ bĕṭṭi
melu melani mĕchchidi mĕchchavaddā nannunu

(||iṁta||)
sivuguna ābĕsese sem̐talagu naḍḍamai
savugalu seyanaidi sāladā yidi
tavili nīvu dalam̐se talam̐pĕllā nīḍeriṁchi
kava gūrsinaṁdugu sŏkkam̐gavaddā manasu

(||iṁta||)
kalaśhābĕ navvam̐gānu kām̐giliṁchugŏni ninnu
salamulu miṁchi(sa)naidi sāladā idi
nilisi śhrī veṁkaḍeśha nĕraversi nībanulu
balimi sesidini sebaṭṭavaddā yim̐kanu