Imta volabakshamu neevela sesevu

ఇంత వొలపక్షము నీవేల సేసేవు
Language

(॥పల్లవి॥)
ఇంత వొలపక్షము నీవేల సేసేవు
పొంత నీ మరుఁడే మీకు పూఁటవడెనా

(॥ఇంత॥)
మగువ లింద రుండఁగ మనసిచ్చి యాకెతోన
మగిడి మగిడి నీవు మాటలాడేవు
తగులున ఇద్దిని తతిగొని మదనుఁడు
పొగరుఁ బువ్వుల నేసి పొందుసేసెనా

(॥ఇంత॥)
సవతులందరు నీతో సరసములాడఁగాను
నవముగా నాపెతోనే నవ్వు నవ్వేవు
కవగూడి మీలో మీకే కైవసము సేసేనని
జవళితోఁ గంతుఁడు బాసలు సేసెనా

(॥ఇంత॥)
వొయుచు నీదేవుళ్లు వూడిగాలు సేయఁగాను
కరణతో నీవాకెను కాఁగిలించేవు
ఇరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పురుఁడించి కాముఁ డిట్టె బుద్ది చెప్పెనా

(||pallavi||)
iṁta vŏlabakṣhamu nīvela sesevu
pŏṁta nī marum̐ḍe mīgu pūm̐ṭavaḍĕnā

(||iṁta||)
maguva liṁda ruṁḍam̐ga manasichchi yāgĕdona
magiḍi magiḍi nīvu māḍalāḍevu
taguluna iddini tadigŏni madanum̐ḍu
pŏgarum̐ buvvula nesi pŏṁdusesĕnā

(||iṁta||)
savadulaṁdaru nīdo sarasamulāḍam̐gānu
navamugā nābĕdone navvu navvevu
kavagūḍi mīlo mīge kaivasamu sesenani
javaḽidom̐ gaṁtum̐ḍu bāsalu sesĕnā

(||iṁta||)
vŏyusu nīdevuḽlu vūḍigālu seyam̐gānu
karaṇado nīvāgĕnu kām̐giliṁchevu
iravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
purum̐ḍiṁchi kāmum̐ ḍiṭṭĕ buddi sĕppĕnā