ఇంత వొలపక్షపాతి వెట్లైతివి
(॥పల్లవి॥)
ఇంత వొలపక్షపాతి వెట్లైతివి
బంతినే నామీఁదఁ గడుబత్తిసేసే విపుడు
(॥ఇంత॥)
వేడుకతో నేకతాన విన్నవించిన నామాట
లాడుకొంటివా అపుడే ఆకెతోడను
వీడెము నే నిచ్చినది వెస నాకెవొడిఁ బెట్టి
యీడ నామొగము చూచే వేమిగట్టుకొంటివి
(॥ఇంత॥)
యేపుననీవురమున నిటు నే మెత్తినకస్తూ
రాపెకుఁ బెట్టితివా అపుడే నీవు
మాపుదాఁకాను ఇంటిలో మగువఁ బెట్టుకవుండి
యీపొద్దు నన్నఁటవచ్చే వేమనేది నిన్నును
(॥ఇంత॥)
ప్రేమమున నీతోనేను పెండ్లాడినగురుతు
కామినికిఁ జూపితివా కానుకగాను
ఆముకొని శ్రీవేంకటాధిప నన్నేలితివి
దోమటి నిద్దరికిఁ గాంతుఁడ వైతి విపుడు
(||pallavi||)
iṁta vŏlabakṣhabādi vĕṭlaidivi
baṁtine nāmīm̐dam̐ gaḍubattisese vibuḍu
(||iṁta||)
veḍugado negadāna vinnaviṁchina nāmāḍa
lāḍugŏṁṭivā abuḍe āgĕdoḍanu
vīḍĕmu ne nichchinadi vĕsa nāgĕvŏḍim̐ bĕṭṭi
yīḍa nāmŏgamu sūse vemigaṭṭugŏṁṭivi
(||iṁta||)
yebunanīvuramuna niḍu ne mĕttinagastū
rābĕgum̐ bĕṭṭidivā abuḍe nīvu
mābudām̐kānu iṁṭilo maguvam̐ bĕṭṭugavuṁḍi
yībŏddu nannam̐ṭavachche vemanedi ninnunu
(||iṁta||)
premamuna nīdonenu pĕṁḍlāḍinagurudu
kāminigim̐ jūbidivā kānugagānu
āmugŏni śhrīveṁkaḍādhiba nannelidivi
domaḍi niddarigim̐ gāṁtum̐ḍa vaidi vibuḍu