ఇంత సేసినవాఁడవు యీడేర్చవయ్యా
(॥పల్లవి॥)
ఇంత సేసినవాఁడవు యీడేర్చవయ్యా
కొ౧తైనా నీ దీమసము కొమ్మ కియ్యవయ్యా
(॥ఇంత॥)
వలపుల వడ దాఁకె వనిత నిన్నుఁ బాయగ
అలరి చలి మందుల కప్పణీవయ్యా
నిలువెల్లఁ జెమరించె నీతోడి సరసముల
పొలుపుగ మంచిగందవొడి గూర్చవయ్యా
(॥ఇంత॥)
ఆసల నుంగిటి గొనె అట్టె నీకెదురు చూచి
సేసచల్లుచు వద్దని చెప్పించవయ్యా
రాసికెక్కఁ బులకించె రతి నీయెడ మాటలు
వాసిఁ గుచ్చి ముత్తేలుగాఁ జేసి దాఁచుకోవయ్యా
(॥ఇంత॥)
రతిఁ బరవశమందె రవ్వగ నీవు గూడఁగ
సతిని కొనగోర నెచ్చరించవయ్యా
మతి నన్ను జంకించె నెమ్మదిని శ్రీ వేంకటేశ
తతివచ్చె నీ బాసలు దలఁచుకోవయ్యా
(||pallavi||)
iṁta sesinavām̐ḍavu yīḍersavayyā
kŏ౧tainā nī dīmasamu kŏmma kiyyavayyā
(||iṁta||)
valabula vaḍa dām̐kĕ vanida ninnum̐ bāyaga
alari sali maṁdula kappaṇīvayyā
niluvĕllam̐ jĕmariṁchĕ nīdoḍi sarasamula
pŏlubuga maṁchigaṁdavŏḍi gūrsavayyā
(||iṁta||)
āsala nuṁgiḍi gŏnĕ aṭṭĕ nīgĕduru sūsi
sesasallusu vaddani sĕppiṁchavayyā
rāsigĕkkam̐ bulagiṁchĕ radi nīyĕḍa māḍalu
vāsim̐ guchchi muttelugām̐ jesi dām̐sugovayyā
(||iṁta||)
radim̐ baravaśhamaṁdĕ ravvaga nīvu gūḍam̐ga
sadini kŏnagora nĕchchariṁchavayyā
madi nannu jaṁkiṁchĕ nĕmmadini śhrī veṁkaḍeśha
tadivachchĕ nī bāsalu dalam̐sugovayyā