Imta ṟattu gaamdagunaa imtulagunu

ఇంత ఱట్టు గాఁదగునా ఇంతులకును
Language

(॥పల్లవి॥)
ఇంత ఱట్టు గాఁదగునా ఇంతులకును
మంతనాన నీవే నన్ను మన్నించరాదా

(॥॥)
పచ్చిమాటలేలాడేవు పరాకులేల సే సేవు
తచ్చి నే నీకుఁ బాదము లొ త్తఁగా
యెచ్చరికతోఁ జెలు లిరువంకా నున్నవారు
బచ్చెనసిగ్గు విడిచి పై కొందునా నేను

(॥॥)
కొనగోరే లంటించేవు గుట్టులేల సేసేవు
యెనయ నీకు వింజామ రిట్టె వేయఁగా
మనికై వూడిగాలభామలు గొలువు సేసేరు
మనసుమఱఁగు లేక మర్మాలు ముట్టుదునా

(॥॥)
దుప్పటేల కుప్పేవు తూరి యేమి భావించేవు
చెప్పి శ్రీవేంకటేశుఁడ చేరి కూడఁగా
చొప్పుగా సవతులెల్లా చుట్టిరానున్న వారు
యిప్పటలయిక మాన కింకాఁగూడుదునా

(||pallavi||)
iṁta ṟaṭṭu gām̐dagunā iṁtulagunu
maṁtanāna nīve nannu manniṁcharādā

(||||)
pachchimāḍalelāḍevu parāgulela se sevu
tachchi ne nīgum̐ bādamu lŏ ttam̐gā
yĕchcharigadom̐ jĕlu liruvaṁkā nunnavāru
bachchĕnasiggu viḍisi pai kŏṁdunā nenu

(||||)
kŏnagore laṁṭiṁchevu guṭṭulela sesevu
yĕnaya nīgu viṁjāma riṭṭĕ veyam̐gā
manigai vūḍigālabhāmalu gŏluvu seseru
manasumaṟam̐gu lega marmālu muṭṭudunā

(||||)
duppaḍela kuppevu tūri yemi bhāviṁchevu
sĕppi śhrīveṁkaḍeśhum̐ḍa seri kūḍam̐gā
sŏppugā savadulĕllā suṭṭirānunna vāru
yippaḍalayiga māna kiṁkām̐gūḍudunā