ఇంత పచ్చిసేయనేల ఇల్లాల నేను
(॥పల్లవి॥)
ఇంత పచ్చిసేయనేల ఇల్లాల నేను
అంత వలసితే వెలయాండ్ల నడుగరాదా
(॥ఇంత॥)
ముప్పిరి నాడఁగరాక ముంచి నే సిగ్గువడఁగ
చెప్పరానిమాటలకు చెవియొగ్గేవు
అప్పటిని వేడుకైతై నంగజశాస్త్రములెల్ల
తప్పకుండాఁ జదువుక తనివందరాదా
(॥ఇంత॥)
యేడా రట్టుసేయక ఇన్నియు నే దాఁచఁగాను
చూడరానిచేఁతలకు సూటి చూచేవు
తోడనే నీకితవైతే తొయ్యలుల యంగాలెల్లా
జోడుగా నాటకసాలఁ జూచుకొనరాదా
(॥ఇంత॥)
పాయపు మదముతోడఁ బట్టి నేఁ బెనఁగఁగాను
సేయరానిపనులకు జేఇచాఁచేవు
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
ఆయాలు చెలికత్తెల నాలోచించరాదా
(||pallavi||)
iṁta pachchiseyanela illāla nenu
aṁta valaside vĕlayāṁḍla naḍugarādā
(||iṁta||)
muppiri nāḍam̐garāga muṁchi ne sigguvaḍam̐ga
sĕpparānimāḍalagu sĕviyŏggevu
appaḍini veḍugaidai naṁgajaśhāstramulĕlla
tappaguṁḍām̐ jaduvuga tanivaṁdarādā
(||iṁta||)
yeḍā raṭṭuseyaga inniyu ne dām̐sam̐gānu
sūḍarānisem̐talagu sūḍi sūsevu
toḍane nīgidavaide tŏyyalula yaṁgālĕllā
joḍugā nāḍagasālam̐ jūsugŏnarādā
(||iṁta||)
pāyabu madamudoḍam̐ baṭṭi nem̐ bĕnam̐gam̐gānu
seyarānibanulagu jeisām̐sevu
yīyĕḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
āyālu sĕligattĕla nālosiṁcharādā