Imta neragumdide ninnevva rerumguduramma

ఇంత నేరకుండితే నిన్నెవ్వ రెరుఁగుదురమ్మ
Language

(॥పల్లవి॥)
ఇంత నేరకుండితే నిన్నెవ్వ రెరుఁగుదురమ్మ
వింతలెల్లాఁ జూచిచూచి వెరగయ్యీ మాకు

(॥ఇంత॥)
సేయరానివూడిగాలు చేసిచేసి యాతని
ఆయములు గరఁగించి ఆలవై తివే
చాయల నేపొద్దూ మోముచక్కటిఁ గొలువుసేసి
పాయరానిచుట్టమవై పనిగొంటివే

(॥ఇంత॥)
అనరానిమాటలెల్లా నాడియాడి కళరేఁచి
ఘనునికిఁ జనవరికాంతవైతివే
చెనకి యాతఁడు సేసేచేఁతలెల్లా నొడిగట్టి
యెనలేక యిందరిలో నిట్టె దొరవైతివే

(॥ఇంత॥)
తలఁచరానిరతులఁ దగిలి కూడికూడి
కలికితనాలఁ గతకారివైతివే
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
యెలమి నన్నేలె నీవూ నిందుకు మెచ్చితివే

(||pallavi||)
iṁta neraguṁḍide ninnĕvva rĕrum̐guduramma
viṁtalĕllām̐ jūsisūsi vĕragayyī māgu

(||iṁta||)
seyarānivūḍigālu sesisesi yādani
āyamulu garam̐giṁchi ālavai tive
sāyala nebŏddū momusakkaḍim̐ gŏluvusesi
pāyarānisuṭṭamavai panigŏṁṭive

(||iṁta||)
anarānimāḍalĕllā nāḍiyāḍi kaḽarem̐si
ghanunigim̐ janavarigāṁtavaidive
sĕnagi yādam̐ḍu sesesem̐talĕllā nŏḍigaṭṭi
yĕnalega yiṁdarilo niṭṭĕ dŏravaidive

(||iṁta||)
talam̐sarāniradulam̐ dagili kūḍigūḍi
kaligidanālam̐ gadagārivaidive
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
yĕlami nannelĕ nīvū niṁdugu mĕchchidive