Imta naabai batti galuderumgudune

ఇంత నాపై బత్తి గలుతెరుఁగుదునే
Language

(॥పల్లవి॥)
ఇంత నాపై బత్తి గలుతెరుఁగుదునే
మంతనాన నన్నుఁ దాను మన్నించుటే చాలదా

(॥॥)
మొక్కకుమనవే తాను మునుపనే దొడ్డదొర
తక్క కడపము వట్టేతరుణి నేను
దిక్కులఁదనపట్టపుదేవుళ్లు విని యట్టె
వెక్కసాన నవ్వితేను విననోప నేను

(॥॥)
కిందుపడకుమనవే క్రియగలపంతగాఁడు
కందువ కాళాఁజివట్టేకామిని నేను
గొందిఁ దనకొత్తపెండ్లి కూఁతులు యీసుద్దెరిఁగి
చెంది తన్నుఁ బంగించితే సిగ్గువడఁజాలను

(॥॥)
తమకించకుమనవే తాను శ్రీవేంకటేశుఁడు
అమర బోనము వెట్టేయంగన నేను
సముకానఁ దా నన్నేలె చనవరులెల్లాఁజూచి
క్రమముతోఁబెనఁగితే కాదనఁగనేరను

(||pallavi||)
iṁta nābai batti galudĕrum̐gudune
maṁtanāna nannum̐ dānu manniṁchuḍe sāladā

(||||)
mŏkkagumanave tānu munubane dŏḍḍadŏra
takka kaḍabamu vaṭṭedaruṇi nenu
dikkulam̐danabaṭṭabudevuḽlu vini yaṭṭĕ
vĕkkasāna navvidenu vinanoba nenu

(||||)
kiṁdubaḍagumanave kriyagalabaṁtagām̐ḍu
kaṁduva kāḽām̐jivaṭṭegāmini nenu
gŏṁdim̐ danagŏttabĕṁḍli kūm̐tulu yīsuddĕrim̐gi
sĕṁdi tannum̐ baṁgiṁchide sigguvaḍam̐jālanu

(||||)
tamagiṁchagumanave tānu śhrīveṁkaḍeśhum̐ḍu
amara bonamu vĕṭṭeyaṁgana nenu
samugānam̐ dā nannelĕ sanavarulĕllām̐jūsi
kramamudom̐bĕnam̐gide kādanam̐ganeranu