Imta meluvaamdavai yimkaa nela jarasevu

ఇంత మేలువాఁడవై యింకా నేల జరసేవు
Language

(॥పల్లవి॥)
ఇంత మేలువాఁడవై యింకా నేల జరసేవు
సంతోసముతోడనే చనవియ్యరాదా

(॥ఇంత॥)
చెలిచిరునవ్వులనే చిత్తము గరఁగితివి
యెలమి నాపెతోఁ బంతా లే లాడేవు
కలికిచూపులకే కాయమెల్లాఁ జెమరించె
పెలుచుఁదనాల నేల పెనఁగులాడేవు

(॥ఇంత॥)
పెదవిపైమాఁటలకే పెద్దగా వలచితివి
యెదిరించి యాల యెలయించ వచ్చేవు
వుదుటు గుబ్బలకే వుబ్బి మొగమోడితివి
మదిరాక్షితో నేల మారుకొనేవు

(॥ఇంత॥)
అట్టె చే సన్నలకే ఆ సాసలఁ జొక్కితివి
దిట్ట సరసాలనే తిట్టఁ జూచేవు
గుట్టున శ్రీవేంకటేశ కూడితి వలమేల్మంగను
వొట్టుక యాకె నింతేల వొలలఁ బెట్టెవు

(||pallavi||)
iṁta meluvām̐ḍavai yiṁkā nela jarasevu
saṁtosamudoḍane sanaviyyarādā

(||iṁta||)
sĕlisirunavvulane sittamu garam̐gidivi
yĕlami nābĕdom̐ baṁtā le lāḍevu
kaligisūbulage kāyamĕllām̐ jĕmariṁchĕ
pĕlusum̐danāla nela pĕnam̐gulāḍevu

(||iṁta||)
pĕdavibaimām̐ṭalage pĕddagā valasidivi
yĕdiriṁchi yāla yĕlayiṁcha vachchevu
vuduḍu gubbalage vubbi mŏgamoḍidivi
madirākṣhido nela mārugŏnevu

(||iṁta||)
aṭṭĕ se sannalage ā sāsalam̐ jŏkkidivi
diṭṭa sarasālane tiṭṭam̐ jūsevu
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidi valamelmaṁganu
vŏṭṭuga yāgĕ niṁtela vŏlalam̐ bĕṭṭĕvu