ఇంపు గలిగినచోట నెగ్గులు పట్టఁగనేల
(॥పల్లవి॥)
ఇంపు గలిగినచోట నెగ్గులు పట్టఁగనేల
గుంపించి మీరేల ఆడుకొనేరే సవతులు
(॥॥)
కూరిమితో రమణునిఁ గొంత సొలసినసతి
వేరులేనిమాటల వేఁడుకొనును
బీరముతో రతివేళ బిగిసి పెనఁగులాడి
చేరి యంతతోఁ గరఁగి చెక్కునొక్కును
(॥॥)
చనవున బొమ్మలను జంకించినకాంత
మునకొని యాసరేఁచి మోవి చూపును
కొనగోరఁ జిమ్మిచిమ్మి గుట్టుతో నొట్టువెట్టి
తనివారాఁ గాఁగిలించి దప్పిదేర్చును
(॥॥)
శిరసువంచుక లోలో సిగ్గులువడినలేమ
సరికిబేసికి సరసములాడును
ఇరవై శ్రీ వేంకటేశుఁ డిన్నిటాఁ గూడెఁ గనక
పరగఁ బెండ్లిపీఁటపైఁ గొలువుండును
(||pallavi||)
iṁpu galiginasoḍa nĕggulu paṭṭam̐ganela
guṁpiṁchi mīrela āḍugŏnere savadulu
(||||)
kūrimido ramaṇunim̐ gŏṁta sŏlasinasadi
verulenimāḍala vem̐ḍugŏnunu
bīramudo radiveḽa bigisi pĕnam̐gulāḍi
seri yaṁtadom̐ garam̐gi sĕkkunŏkkunu
(||||)
sanavuna bŏmmalanu jaṁkiṁchinagāṁta
munagŏni yāsarem̐si movi sūbunu
kŏnagoram̐ jimmisimmi guṭṭudo nŏṭṭuvĕṭṭi
tanivārām̐ gām̐giliṁchi dappidersunu
(||||)
śhirasuvaṁchuga lolo sigguluvaḍinalema
sarigibesigi sarasamulāḍunu
iravai śhrī veṁkaḍeśhum̐ ḍinniḍām̐ gūḍĕm̐ ganaga
paragam̐ bĕṁḍlibīm̐ṭabaim̐ gŏluvuṁḍunu