Imkanele visaaraalu yemchinattallaanaaya

ఇంకనేలే విచారాలు యెంచినట్టల్లానాయ
Language

(॥పల్లవి॥)
ఇంకనేలే విచారాలు యెంచినట్టల్లానాయ
కొంకులేని మనలోని కోరికె ఫలించెనే

(॥ఇంక॥)
చిత్తము చిమ్మిరేఁగె సిగ్గులు వెల్లివిరిసె
హత్తిన సంతోసాల అలుగువారె
కొత్త వలపులు నిండె గుదిగొనెఁ దమకము
బత్తిగల జవరాలి భాగ్య మాయనే

(॥ఇంక॥)
వేడుకలు పిక్కటిల్లె విభవాలు దలకొనె
వాడిక వినోదాలు వంతు కెక్కెను
యీడు జొళ్లొక్కటాయ యియ్యకోలాయఁ బంతాలు
కూడి నాపె నోములు చేకూరి మించెనే

(॥ఇంక॥)
నగవురు గారుకమ్మె ననుపులు నెట్టుకొనె
మొగమునఁ గళలెల్లా ముంచుకొనెను
నిగిడి శ్రీవేంకటేశుని పొందులు సతమాయ
తగులైన దేవుల తలఁపు లీడేరెనే

(||pallavi||)
iṁkanele visārālu yĕṁchinaṭṭallānāya
kŏṁkuleni manaloni korigĕ phaliṁchĕne

(||iṁka||)
sittamu simmirem̐gĕ siggulu vĕllivirisĕ
hattina saṁtosāla aluguvārĕ
kŏtta valabulu niṁḍĕ gudigŏnĕm̐ damagamu
battigala javarāli bhāgya māyane

(||iṁka||)
veḍugalu pikkaḍillĕ vibhavālu dalagŏnĕ
vāḍiga vinodālu vaṁtu kĕkkĕnu
yīḍu jŏḽlŏkkaḍāya yiyyagolāyam̐ baṁtālu
kūḍi nābĕ nomulu segūri miṁchĕne

(||iṁka||)
nagavuru gārugammĕ nanubulu nĕṭṭugŏnĕ
mŏgamunam̐ gaḽalĕllā muṁchugŏnĕnu
nigiḍi śhrīveṁkaḍeśhuni pŏṁdulu sadamāya
tagulaina devula talam̐pu līḍerĕne