Imkanele vegiramu yedudane vunnavaamdu

ఇంకనేలే వేగిరము యెదుటనే వున్నవాఁడు
Language

(॥పల్లవి॥)
ఇంకనేలే వేగిరము యెదుటనే వున్నవాఁడు
సంకెలు దీరినందుకు చలమే గురి

(॥ఇంక॥)
తానే వచ్చీఁగాని తరవులు వెట్టకు రే
నానినవలపులకు నవ్వే గురి
ఆనలు వెట్టఁగనేల అన్నియును నెరుఁగును
తానకమైనందుకు తాలిమే గురి

(॥ఇంక॥)
చెప్పినట్లు సేసీఁగాని చేయివట్టి తియ్యకురె
ముప్పిరిఁ గాంక్షలకును మొక్కులే గురి
తప్పులువట్టఁగనేల తమక మెప్పుడుఁ గద్దు
చిప్పిలుఁబొందులకును సిగ్గులే గురి

(॥ఇంక॥)
గక్కున మన్నంచీఁగాని కాఁతాళించి దూరకురే
చొక్కినకరఁగులకు చూపులే గురి
యెక్కువ శ్రీవేంకటేశుఁ డీడ నన్నంటుక కూడె
దక్కి నావాఁడైనందుకు తను విదే గురి

(||pallavi||)
iṁkanele vegiramu yĕduḍane vunnavām̐ḍu
saṁkĕlu dīrinaṁdugu salame guri

(||iṁka||)
tāne vachchīm̐gāni taravulu vĕṭṭagu re
nāninavalabulagu navve guri
ānalu vĕṭṭam̐ganela anniyunu nĕrum̐gunu
tānagamainaṁdugu tālime guri

(||iṁka||)
sĕppinaṭlu sesīm̐gāni seyivaṭṭi tiyyagurĕ
muppirim̐ gāṁkṣhalagunu mŏkkule guri
tappuluvaṭṭam̐ganela tamaga mĕppuḍum̐ gaddu
sippilum̐bŏṁdulagunu siggule guri

(||iṁka||)
gakkuna mannaṁchīm̐gāni kām̐tāḽiṁchi dūragure
sŏkkinagaram̐gulagu sūbule guri
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ ḍīḍa nannaṁṭuga kūḍĕ
dakki nāvām̐ḍainaṁdugu tanu vide guri