Imkanela doorumaada limtegaaga

ఇంకనేల దూరుమాట లింతేకాక
Language

(॥పల్లవి॥)
ఇంకనేల దూరుమాట లింతేకాక
కొంకుదీర నిన్ను నిట్టె కూడఁగలఁ గాక

(॥ఇంక॥)
తప్పులెంచి నీగుణాలు తగదనేనా మోము
తప్పకిట్టె నిన్నుఁ జూచి తనిసేఁగాక
అప్పుడు నీ వన్నమాట కాఁగఁబోయేనా నా-
నొప్పిదీర నీచెక్కు నొక్కఁగలఁగాక

(॥ఇంక॥)
యేమి సేసినాను నిన్ను యెగ్గువట్టేనా
నాముదేర సెలవుల నవ్వేఁగాక
బూమివారివలె నీకు బుద్దిచెప్పేనా
వేమారు నీపై మేను వేయఁగలఁగాక

(॥ఇంక॥)
పానుపుపై నీతో నింక పంతమాడేనా నీ-
సోనల మోవితేనెలఁ జొక్కేఁగాక
కావీలే శ్రీవేంకటేశ కాదనేనా నీ-
మేనుసోఁకినరతుల మెచ్చఁగలఁగాక

(||pallavi||)
iṁkanela dūrumāḍa liṁtegāga
kŏṁkudīra ninnu niṭṭĕ kūḍam̐galam̐ gāga

(||iṁka||)
tappulĕṁchi nīguṇālu tagadanenā momu
tappagiṭṭĕ ninnum̐ jūsi tanisem̐gāga
appuḍu nī vannamāḍa kām̐gam̐boyenā nā-
nŏppidīra nīsĕkku nŏkkam̐galam̐gāga

(||iṁka||)
yemi sesinānu ninnu yĕgguvaṭṭenā
nāmudera sĕlavula navvem̐gāga
būmivārivalĕ nīgu buddisĕppenā
vemāru nībai menu veyam̐galam̐gāga

(||iṁka||)
pānububai nīdo niṁka paṁtamāḍenā nī-
sonala movidenĕlam̐ jŏkkem̐gāga
kāvīle śhrīveṁkaḍeśha kādanenā nī-
menusom̐kinaradula mĕchcham̐galam̐gāga