ఇంకనేల బొంకేవు యింత బాఁతి పడఁగాను
(॥పల్లవి॥)
ఇంకనేల బొంకేవు యింత బాఁతి పడఁగాను
అంకెల నీ వాతని యానతి మీరకువే
(॥ఇంక॥)
అట్టె పాట పాడి యంతలో విభునిఁగని
గుట్టుతోడ సిగ్గువడి కూచుంటి వేమే
గట్టిగ వేడుకతోడఁ గడమని నేనంటా
పెట్టీ దనపై నానలు పెనఁగక పాడవే
(॥ఇంక॥)
నీలోనే నవ్వుతా వచ్చి నెట్టన నాతనిఁ గని
తాలిమిఁ జెలియపొంత దా కొనేవేమే
ఆలించి తా నంతలో ని న్నందుకే వేడుకపడి
చేలకొంగు వట్టి తీసీ చిత్తము రా నవ్వవే
(॥ఇంక॥)
చేరి పవ్వళించియుండి శ్రీ వేంకటేశుఁగని
వూరకే లేచి నిలుచు కుండే వేమే
గారవించి వుండుమని కాఁగిలించుకొనీ నిన్ను
సారె నీవాతనితోడ జంటై పవ్వళించవే
(||pallavi||)
iṁkanela bŏṁkevu yiṁta bām̐ti paḍam̐gānu
aṁkĕla nī vādani yānadi mīraguve
(||iṁka||)
aṭṭĕ pāḍa pāḍi yaṁtalo vibhunim̐gani
guṭṭudoḍa sigguvaḍi kūsuṁṭi veme
gaṭṭiga veḍugadoḍam̐ gaḍamani nenaṁṭā
pĕṭṭī danabai nānalu pĕnam̐gaga pāḍave
(||iṁka||)
nīlone navvudā vachchi nĕṭṭana nādanim̐ gani
tālimim̐ jĕliyabŏṁta dā kŏneveme
āliṁchi tā naṁtalo ni nnaṁduge veḍugabaḍi
selagŏṁgu vaṭṭi tīsī sittamu rā navvave
(||iṁka||)
seri pavvaḽiṁchiyuṁḍi śhrī veṁkaḍeśhum̐gani
vūrage lesi nilusu kuṁḍe veme
gāraviṁchi vuṁḍumani kām̐giliṁchugŏnī ninnu
sārĕ nīvādanidoḍa jaṁṭai pavvaḽiṁchave