ఇంకనేది వుపాయము యెంచి చూచుకొనవయ్యా
(॥పల్లవి॥)
ఇంకనేది వుపాయము యెంచి చూచుకొనవయ్యా
పంకపుఁ జెమటల గుబ్బతిలుతా నున్నది
(॥ఇంక॥)
కిన్నెర వాయించుకొంటా కెరలి తానములకు
తన్నుఁదానె మెచ్చి చొక్కుతా నుండఁగా
వున్నతి నీ వంతలోనె వొద్దికి వచ్చితేఁ జూచి
చెన్నుమీరఁ దలపంచి సిగ్గువడి వున్నది
(॥ఇంక॥)
పదములు చెప్పుతాను పొడి యాయర్థములెల్లా
నుదుతులకెల్లాఁ జెప్పిచూపుచు నుండి
యెదుట నీమోము చూచి ఇంతలోనె మొఱఁగుచు
మదిరాక్షి చెక్కు చేయిమాటు చేసుకొన్నది
(॥ఇంక॥)
రతి చిత్తారు వాయుచు రాఁపువినోదములు
అతిమదనకళల నలరి ఇట్టె
కతగా శ్రీవేంకటేశ గక్కన నిన్నుఁ గూడి
మితిమీరి సంతోసాన మెరయుచు నున్నది
(||pallavi||)
iṁkanedi vubāyamu yĕṁchi sūsugŏnavayyā
paṁkabum̐ jĕmaḍala gubbadiludā nunnadi
(||iṁka||)
kinnĕra vāyiṁchugŏṁṭā kĕrali tānamulagu
tannum̐dānĕ mĕchchi sŏkkudā nuṁḍam̐gā
vunnadi nī vaṁtalonĕ vŏddigi vachchidem̐ jūsi
sĕnnumīram̐ dalabaṁchi sigguvaḍi vunnadi
(||iṁka||)
padamulu sĕppudānu pŏḍi yāyardhamulĕllā
nududulagĕllām̐ jĕppisūbusu nuṁḍi
yĕduḍa nīmomu sūsi iṁtalonĕ mŏṟam̐gusu
madirākṣhi sĕkku seyimāḍu sesugŏnnadi
(||iṁka||)
radi sittāru vāyusu rām̐puvinodamulu
adimadanagaḽala nalari iṭṭĕ
kadagā śhrīveṁkaḍeśha gakkana ninnum̐ gūḍi
midimīri saṁtosāna mĕrayusu nunnadi