ఇంకనైనా నుపకార మెఱుఁగుకొమ్మీ
(॥పల్లవి॥)
ఇంకనైనా నుపకార మెఱుఁగుకొమ్మీ
తెంకి నా గుణాలిట్టే తెలుసుకొమ్మీ
(॥ఇంక॥)
తప్పులు వట్టింతునా తరుణులచేతనెల్ల
చిప్పిల నందుకేమీఁ జిన్నఁబోకుమీ
కప్పింతునా నీమేని ఘాతలు కస్తూరివూసి
చప్పఁగాక ఇందుకైనా సంతోసించుమీ
(॥ఇంక॥)
కొంగులు వట్టింతునా గురుతైనవారిచేత
అంగవించి సిగ్గువడి అలయకుమీ
ముంగిట నాడింతునా ముందే నిజమరివని
చెంగట నాపంతములు చిత్తగించుమీ
(॥ఇంక॥)
నవ్వులు నవ్వింతునా నావంటివారిచేత
జవ్వనమదముచేత జడియకుమీ
ఇవ్వల శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
నివ్వటిల్లు నా మోహము నీ వెఱుఁగుమీ
(||pallavi||)
iṁkanainā nubagāra mĕṟum̐gugŏmmī
tĕṁki nā guṇāliṭṭe tĕlusugŏmmī
(||iṁka||)
tappulu vaṭṭiṁtunā taruṇulasedanĕlla
sippila naṁdugemīm̐ jinnam̐bogumī
kappiṁtunā nīmeni ghādalu kastūrivūsi
sappam̐gāga iṁdugainā saṁtosiṁchumī
(||iṁka||)
kŏṁgulu vaṭṭiṁtunā gurudainavāriseda
aṁgaviṁchi sigguvaḍi alayagumī
muṁgiḍa nāḍiṁtunā muṁde nijamarivani
sĕṁgaḍa nābaṁtamulu sittagiṁchumī
(||iṁka||)
navvulu navviṁtunā nāvaṁṭivāriseda
javvanamadamuseda jaḍiyagumī
ivvala śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
nivvaḍillu nā mohamu nī vĕṟum̐gumī