ఇంకానేల యెడమాఁట లింతితోడను
(॥పల్లవి॥)
ఇంకానేల యెడమాఁట లింతితోడను
లంకెలాయ నిద్దరికి లాలించవయ్యా
(॥ఇంకా॥)
మొక్కలాన నీసుద్దులు మునుపనె వినెఁ జెలి
చక్కఁగా నీతోనాడఁజాలదుగాని
అక్కర నీమతకము లడచుకొన్నది యింత
చెక్కు నొక్కి వేఁడుకొంటేఁ జెప్పీ వినవయ్యా
(॥ఇంకా॥)
అగడైన నీ చేఁత లన్నియు నెరుఁగుఁ జెలి
తగవు దలఁచి లోలో దాఁచీఁగాని
మొగమోటమున నీకు మొక్కుచుఁ గొంకీఁగాని
జిగిమించ వేఁడుకొంటేఁ జెప్పీ వినవయ్యా
(॥ఇంకా॥)
మచ్చికైన నీ గుణాలు మరిగివున్నది చెలి
యెచ్చరించలేక కానుకిచ్చీఁ గాని
యిచ్చట శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి
చెచ్చెర వేఁడుకొంటేను చెప్పీ వినయయ్యా
(||pallavi||)
iṁkānela yĕḍamām̐ṭa liṁtidoḍanu
laṁkĕlāya niddarigi lāliṁchavayyā
(||iṁkā||)
mŏkkalāna nīsuddulu munubanĕ vinĕm̐ jĕli
sakkam̐gā nīdonāḍam̐jāladugāni
akkara nīmadagamu laḍasugŏnnadi yiṁta
sĕkku nŏkki vem̐ḍugŏṁṭem̐ jĕppī vinavayyā
(||iṁkā||)
agaḍaina nī sem̐ta lanniyu nĕrum̐gum̐ jĕli
tagavu dalam̐si lolo dām̐sīm̐gāni
mŏgamoḍamuna nīgu mŏkkusum̐ gŏṁkīm̐gāni
jigimiṁcha vem̐ḍugŏṁṭem̐ jĕppī vinavayyā
(||iṁkā||)
machchigaina nī guṇālu marigivunnadi sĕli
yĕchchariṁchalega kānugichchīm̐ gāni
yichchaḍa śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
sĕchchĕra vem̐ḍugŏṁṭenu sĕppī vinayayyā