Imkaanela salamu yemi seyamgalamu

ఇంకానేల చలము యేమి సేయఁగలము
Language

(॥పల్లవి॥)
ఇంకానేల చలము యేమి సేయఁగలము
అంకెకు వచ్చెను అధరామృత ఫలము

(॥ఇంకా॥)
కలికి వనాలనీడఁ గడు నీ కెదురుచూడ
కులుకునవ్వులతోడఁ గొప్పు వీడ
చెలులెల్లాఁ జాచేరు జిగిఁ గౌను లసియాడ
బలిమిఁ జేకొనవయ్యబత్తితోఁ గూడ

(॥ఇంకా॥)
సతి నీపాదాలు మెట్ట చన్నులు నీవు ముట్ట
తతి నిన్ను నిదె దిట్టతనాలఁదిట్ట
అతివలు సొలసేరు అంగాలఁ జెమట దొట్ట
సతతము మెచ్చవయ్యా జాణలు చేపట్ట

(॥ఇంకా॥)
జలజక్షి నీపక్క సరసముల వేచొక్క
తలపోసీఁ దనచక్కఁదనాలు నిక్క
లలి శ్రీ వేంకటేశ నీలలన నీకు మొక్క
కలకాల మేలు మిక్కడ రతికెక్క

(||pallavi||)
iṁkānela salamu yemi seyam̐galamu
aṁkĕgu vachchĕnu adharāmṛta phalamu

(||iṁkā||)
kaligi vanālanīḍam̐ gaḍu nī kĕdurusūḍa
kulugunavvuladoḍam̐ gŏppu vīḍa
sĕlulĕllām̐ jāseru jigim̐ gaunu lasiyāḍa
balimim̐ jegŏnavayyabattidom̐ gūḍa

(||iṁkā||)
sadi nībādālu mĕṭṭa sannulu nīvu muṭṭa
tadi ninnu nidĕ diṭṭadanālam̐diṭṭa
adivalu sŏlaseru aṁgālam̐ jĕmaḍa dŏṭṭa
sadatamu mĕchchavayyā jāṇalu sebaṭṭa

(||iṁkā||)
jalajakṣhi nībakka sarasamula vesŏkka
talabosīm̐ danasakkam̐danālu nikka
lali śhrī veṁkaḍeśha nīlalana nīgu mŏkka
kalagāla melu mikkaḍa radigĕkka