ఇంకానేల మఱఁగులు ఇద్దరికిని
(॥పల్లవి॥)
ఇంకానేల మఱఁగులు ఇద్దరికిని
పంకించక సోబానఁ బాడేము నేము
(॥ఇంకా॥)
సురటి విసరీ నీకుఁ జూడరాదా ఆపె దిక్కు
శిరసువంచుక యేల సిగ్గవడేవు
ఇరవుగా నెరిఁగిరి ఇందరు నీసుద్దులు
పరగఁగ సోబానఁ బాడేము నేము
(॥ఇంకా॥)
ఆకుమడిచిచ్చీ నీకు నంది పుచ్చుకొనరాదా
చేకొని మరీనేల సిగ్గువడేవు
జోకల మైగురుతు సొరిది బాఇటఁబడె
పైకొలిపి సోబానఁ బాడేము నేము
(॥ఇంకా॥)
వూడిగము సేసేయాపె నొనగూడి మెచ్చరాదా
చేడెలు చూడఁగానేల సిగ్గువడేవు
కూడితవి నన్ను నిట్టె కోరి శ్రీవేంకటేశుఁడ
పాడితోడ సోబానఁ బాడేము నేము
(||pallavi||)
iṁkānela maṟam̐gulu iddarigini
paṁkiṁchaga sobānam̐ bāḍemu nemu
(||iṁkā||)
suraḍi visarī nīgum̐ jūḍarādā ābĕ dikku
śhirasuvaṁchuga yela siggavaḍevu
iravugā nĕrim̐giri iṁdaru nīsuddulu
paragam̐ga sobānam̐ bāḍemu nemu
(||iṁkā||)
āgumaḍisichchī nīgu naṁdi puchchugŏnarādā
segŏni marīnela sigguvaḍevu
jogala maigurudu sŏridi bāiḍam̐baḍĕ
paigŏlibi sobānam̐ bāḍemu nemu
(||iṁkā||)
vūḍigamu seseyābĕ nŏnagūḍi mĕchcharādā
seḍĕlu sūḍam̐gānela sigguvaḍevu
kūḍidavi nannu niṭṭĕ kori śhrīveṁkaḍeśhum̐ḍa
pāḍidoḍa sobānam̐ bāḍemu nemu