ఇంకా వినిపించవే యీ కతలు వేడుకయ్యీ
(॥పల్లవి॥)
ఇంకా వినిపించవే యీ కతలు వేడుకయ్యీ
పొంకముగా జెలియా పొద్దువోదు నాకును
(॥ఇంకా॥)
సొలసి తనతో నేను సుద్దులు చెప్పినవెల్లా
తలఁచుక చెప్పెనా తరుణి నీతో
వలుద గుబ్బలఁ జంద్రవంకలు దా నొత్తినవి
తెలిపెనా దాఁచక తేటతెల్లమిగను
(॥ఇంకా॥)
తంతోడ నేకతాన తననాసంది పొందులు
మఱవక యడిగెనా మంచితనాన
మఱి నన్నుఁ గరుణించి మన్నించినీమన్ననల-
గుఱుతు లెఱిఁగించెనా కొంకక నీ కపుడు
(॥ఇంకా॥)
వేడుకతో నేనూఁ దానూ వినోదించిన రతులు
ఆడ నీతోఁ దడవెనా యక్కరతోను
యీడక వచ్చి శ్రీవేంకటేశుఁడు దా నన్ను నేలె
జాడలు నీతో నించెనా సరికి బేసికిని
(||pallavi||)
iṁkā vinibiṁchave yī kadalu veḍugayyī
pŏṁkamugā jĕliyā pŏdduvodu nāgunu
(||iṁkā||)
sŏlasi tanado nenu suddulu sĕppinavĕllā
talam̐suga sĕppĕnā taruṇi nīdo
valuda gubbalam̐ jaṁdravaṁkalu dā nŏttinavi
tĕlibĕnā dām̐saga teḍadĕllamiganu
(||iṁkā||)
taṁtoḍa negadāna tananāsaṁdi pŏṁdulu
maṟavaga yaḍigĕnā maṁchidanāna
maṟi nannum̐ garuṇiṁchi manniṁchinīmannanala-
guṟudu lĕṟim̐giṁchĕnā kŏṁkaga nī kabuḍu
(||iṁkā||)
veḍugado nenūm̐ dānū vinodiṁchina radulu
āḍa nīdom̐ daḍavĕnā yakkaradonu
yīḍaga vachchi śhrīveṁkaḍeśhum̐ḍu dā nannu nelĕ
jāḍalu nīdo niṁchĕnā sarigi besigini