Imkaa nitlaane gadiyimchugonavayya dhanamu

ఇంకా నిట్లానే గడియించుకొనవయ్య ధనము
Language

(॥పల్లవి॥)
ఇంకా నిట్లానే గడియించుకొనవయ్య ధనము
సంకెలేక చిత్తమనే జాళెఁ బోసుకొందువు

(॥ఇంకా॥)
తెలిసి నీసుద్దులెల్ల తేటలెల్లమాయను
వల పినుమడిగాను వడ్డికిచ్చేవు
యెలమి నందుకు సాక్షి యిరుమేలా నున్నావారు
బలిమిఁ బంచబాణాలు పంచారూడిపత్రము

(॥ఇంకా॥)
కంటికి నీజాడలెల్ల కడుదిష్టమాయను
నంటువావులు ముమ్మడినాఁగు కిచ్చేవు
దంటతనానఁ గొలువ తలపోఁతే కుంచము
అంటినగొల్లెతలెల్ల నప్పులవారు

(॥ఇంకా॥)
మెచ్చితిమి నీకూటమి మీఁదమీఁద మేలాయను
పెచ్చురతి నలుమడి బేరమాడేవు
ఇచ్చకుండ శ్రీవేంకటేశ నీవే లాబగాఁడ
వచ్చపుగోరొత్తులెల్లా నన్నిటికీ లెక్కలు

(||pallavi||)
iṁkā niṭlāne gaḍiyiṁchugŏnavayya dhanamu
saṁkĕlega sittamane jāḽĕm̐ bosugŏṁduvu

(||iṁkā||)
tĕlisi nīsuddulĕlla teḍalĕllamāyanu
vala pinumaḍigānu vaḍḍigichchevu
yĕlami naṁdugu sākṣhi yirumelā nunnāvāru
balimim̐ baṁchabāṇālu paṁchārūḍibatramu

(||iṁkā||)
kaṁṭigi nījāḍalĕlla kaḍudiṣhṭamāyanu
naṁṭuvāvulu mummaḍinām̐gu kichchevu
daṁṭadanānam̐ gŏluva talabom̐te kuṁchamu
aṁṭinagŏllĕdalĕlla nappulavāru

(||iṁkā||)
mĕchchidimi nīgūḍami mīm̐damīm̐da melāyanu
pĕchchuradi nalumaḍi beramāḍevu
ichchaguṁḍa śhrīveṁkaḍeśha nīve lābagām̐ḍa
vachchabugorŏttulĕllā nanniḍigī lĕkkalu