Imkaa nemta sesenamtaa neebe gaasugunnado

ఇంకా నెంత సేసేనంటా నీపె గాచుకున్నదో
Language

(॥పల్లవి॥)
ఇంకా నెంత సేసేనంటా నీపె గాచుకున్నదో
సంకెలేక నీపంత మిచ్చట మెఱయవయ్యా

(॥ఇంకా॥)
కన్నులఁ దప్పకచూచి కలువల నిన్నువేసి
సన్నలనే నీపొందులు సాదించెఁగా
చన్నులమీఁది పయ్యెద జారఁగ సరసమాడి
ఇన్నేసిచేఁతల నిన్ను నెలయించెఁగా

(॥ఇంకా॥)
చక్కఁదనములు చూపి సరుసనె కూచుండి
ఇక్కువ లంటుచు నీకె యెలయించెఁగా
పిక్కటిల్లఁ బెనఁగుచు పెదవులనే నవ్వి
తక్కించి నిన్నిన్నిటాను తమ రేఁచెఁగా

(॥ఇంకా॥)
వింత వింత మాఁట లాడి వేడుకలు పచరించి
మంతనపు రతులను మరిగించెఁగా
యింతలో శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
వంతు వెట్టుక నిన్నిట్టె వరుసఁ జొక్కించెఁగా

(||pallavi||)
iṁkā nĕṁta sesenaṁṭā nībĕ gāsugunnado
saṁkĕlega nībaṁta michchaḍa mĕṟayavayyā

(||iṁkā||)
kannulam̐ dappagasūsi kaluvala ninnuvesi
sannalane nībŏṁdulu sādiṁchĕm̐gā
sannulamīm̐di payyĕda jāram̐ga sarasamāḍi
innesisem̐tala ninnu nĕlayiṁchĕm̐gā

(||iṁkā||)
sakkam̐danamulu sūbi sarusanĕ kūsuṁḍi
ikkuva laṁṭusu nīgĕ yĕlayiṁchĕm̐gā
pikkaḍillam̐ bĕnam̐gusu pĕdavulane navvi
takkiṁchi ninninniḍānu tama rem̐sĕm̐gā

(||iṁkā||)
viṁta viṁta mām̐ṭa lāḍi veḍugalu pasariṁchi
maṁtanabu radulanu marigiṁchĕm̐gā
yiṁtalo śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
vaṁtu vĕṭṭuga ninniṭṭĕ varusam̐ jŏkkiṁchĕm̐gā