ఇంకా నేమియడిగేవు యిటు మమ్ము సుద్దులు
(॥పల్లవి॥)
ఇంకా నేమియడిగేవు యిటు మమ్ము సుద్దులు
తెంకినే వినవయ్యా నీ దేవుళ్ళ సుద్దులు
(॥ఇంకా॥)
పొలఁతి సెలవులను పున్నమవెన్నెలగాసె
కలసి చన్నులతో జక్కవలు రాసె
కులుకుఁ గుత్తికలోను కోవిలలు గూసెను
వసితే వినవయ్యా వలపుల సుద్దులు
(॥ఇంకా॥)
పడఁతినోరఁ జిలుకపలుకులు వెడరేఁగె
తడవికొప్పునఁ దుమ్మిదలు మూఁగెను
చిడుముడి నడుమను సింహపుఁగొదమ దాఁగె
యెడయక వినవయ్యా ఇవిగో సుద్దులు
(॥ఇంకా॥)
యాలేమపిరుఁదున నిసుకదిబ్బలు వెట్టె
కోలుముందై మేన మెఱుఁగులు దొట్టెను
యేలితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
ఆలకించి వినవయ్యా అరుదైన సుద్దులు
(||pallavi||)
iṁkā nemiyaḍigevu yiḍu mammu suddulu
tĕṁkine vinavayyā nī devuḽḽa suddulu
(||iṁkā||)
pŏlam̐ti sĕlavulanu punnamavĕnnĕlagāsĕ
kalasi sannulado jakkavalu rāsĕ
kulugum̐ guttigalonu kovilalu gūsĕnu
vaside vinavayyā valabula suddulu
(||iṁkā||)
paḍam̐tinoram̐ jilugabalugulu vĕḍarem̐gĕ
taḍavigŏppunam̐ dummidalu mūm̐gĕnu
siḍumuḍi naḍumanu siṁhabum̐gŏdama dām̐gĕ
yĕḍayaga vinavayyā ivigo suddulu
(||iṁkā||)
yālemabirum̐duna nisugadibbalu vĕṭṭĕ
kolumuṁdai mena mĕṟum̐gulu dŏṭṭĕnu
yelidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
ālagiṁchi vinavayyā arudaina suddulu