ఇంక విచారములేల యిద్దరును నొక్కటే
(॥పల్లవి॥)
ఇంక విచారములేల యిద్దరును నొక్కటే
సంకెలేక వుండితేను జరసేరా సతులు
(॥॥)
వనితకు నీకును వాడికమాటలవల్ల
మనసులు సరిదాఁకె మరి యేఁటికి
పెనఁగించుకొననేల ప్రియము తొల్లె కలదు
వొనగూడి వుండఁగాను వొద్దనేరా సతులు
(॥॥)
సుదతికి నీకును సూటులచూపులవల్ల
కదిసెఁజుట్టరికేలు కత లేఁటికి
పదర నింతేసి యేల పనులెల్లా నీడేరె
యెదురెదుర నవ్వగా నేలనేరా సతులు
(॥॥)
జలజాక్షికిని నీకు సారెఁజెనకులవల్ల
కొలఁది మీరె రతులు కొంకనేఁటికి
వెలయఁ గోనేటి శ్రీవేంకటేశ నన్నేలితి
కొలువు సేయించుకొంటేఁ గొసరేరా సతులు
(||pallavi||)
iṁka visāramulela yiddarunu nŏkkaḍe
saṁkĕlega vuṁḍidenu jaraserā sadulu
(||||)
vanidagu nīgunu vāḍigamāḍalavalla
manasulu saridām̐kĕ mari yem̐ṭigi
pĕnam̐giṁchugŏnanela priyamu tŏllĕ kaladu
vŏnagūḍi vuṁḍam̐gānu vŏddanerā sadulu
(||||)
sudadigi nīgunu sūḍulasūbulavalla
kadisĕm̐juṭṭarigelu kada lem̐ṭigi
padara niṁtesi yela panulĕllā nīḍerĕ
yĕdurĕdura navvagā nelanerā sadulu
(||||)
jalajākṣhigini nīgu sārĕm̐jĕnagulavalla
kŏlam̐di mīrĕ radulu kŏṁkanem̐ṭigi
vĕlayam̐ goneḍi śhrīveṁkaḍeśha nannelidi
kŏluvu seyiṁchugŏṁṭem̐ gŏsarerā sadulu