Imka sigguvadaraadu yiddarigi dorasenu

ఇంక సిగ్గువడరాదు యిద్దరికి దొరసెను
Language

(॥పల్లవి॥)
ఇంక సిగ్గువడరాదు యిద్దరికి దొరసెను
లంకెలై యీ జవరాలి లాలించవయ్యా

(॥ఇంక॥)
కొమ్మ చూచిన చూపులు కోరి నీ చూచే చూపులు
తుమ్మిద దంపతులై తూరి పెండ్లాడె
నెమ్మి నాకె చేతులును నీవు చాచిన చేతులును
తమ్మి చుట్టరికములై తవులు కొనెను

(॥ఇంక॥)
కలికి పలుకులును కందువ నీ పలుకులును
చిలుక నేస్తములై చెలువొందెను
మలసి యాపె నవ్వులు మఱి నీ చిరునవ్వులు
పొలప వెన్నెలలై పొత్తులు గలసెను

(॥ఇంక॥)
యీ వనిత కోరికలు యింపుల నీ కోరికలు
పావురపు జోళ్లె పాదుకొనెను
శ్రీవేంకటేశ మీ రతి జిప్పిలు మోవితేనెలు
భావింప దరితీపుల పై కొసరులాయను

(||pallavi||)
iṁka sigguvaḍarādu yiddarigi dŏrasĕnu
laṁkĕlai yī javarāli lāliṁchavayyā

(||iṁka||)
kŏmma sūsina sūbulu kori nī sūse sūbulu
tummida daṁpadulai tūri pĕṁḍlāḍĕ
nĕmmi nāgĕ sedulunu nīvu sāsina sedulunu
tammi suṭṭarigamulai tavulu kŏnĕnu

(||iṁka||)
kaligi palugulunu kaṁduva nī palugulunu
siluga nestamulai sĕluvŏṁdĕnu
malasi yābĕ navvulu maṟi nī sirunavvulu
pŏlaba vĕnnĕlalai pŏttulu galasĕnu

(||iṁka||)
yī vanida korigalu yiṁpula nī korigalu
pāvurabu joḽlĕ pādugŏnĕnu
śhrīveṁkaḍeśha mī radi jippilu movidenĕlu
bhāviṁpa daridībula pai kŏsarulāyanu