Imka nojagu vachcheenaa yemta buddiseppinaanu

ఇంక నోజకు వచ్చీనా యెంత బుద్దిచెప్పినాను
Language

(॥పల్లవి॥)
ఇంక నోజకు వచ్చీనా యెంత బుద్దిచెప్పినాను
బింకపు మోహాన రట్టు పెట్టితివి యీపెను

(॥ఇంక॥)
వుంకించి నీవొడివట్టి వొకటొకటె నిన్నాడీ
మంకుది; నెతో నెంత మందెమేళము
జింకించి నేనెడచొచ్చి సారెవద్దన్నా మానదు
తెంకి నింత రాఁగఁజేసితివినీవే యీకెను

(॥ఇంక॥)
కొప్పువట్టి నిన్నుఁ దీసి కొసరీఁ గూరిములెల్లా
ఇప్పుడే నీతోడి నీ కెంత గర్వము
చెప్పుచు నేఁ గనుసన్న సేసినాఁ దా నెఱఁగదు
చిప్పిల గట్టువాయఁ జేసితివి నీ వీపెను

(॥ఇంక॥)
గోర గీరి కాఁగిలించి కుచముల నిన్ను నొత్తి
తారసిల్లీ; తన కెంతదంటతనము
చేరి నిన్ను నెనసి సిగ్గువరచినఁ బోదు
మేరలు శ్రీవేంకటేశ మీరించితి వీపెను

(||pallavi||)
iṁka nojagu vachchīnā yĕṁta buddisĕppinānu
biṁkabu mohāna raṭṭu pĕṭṭidivi yībĕnu

(||iṁka||)
vuṁkiṁchi nīvŏḍivaṭṭi vŏgaḍŏgaḍĕ ninnāḍī
maṁkudi; nĕdo nĕṁta maṁdĕmeḽamu
jiṁkiṁchi nenĕḍasŏchchi sārĕvaddannā mānadu
tĕṁki niṁta rām̐gam̐jesidivinīve yīgĕnu

(||iṁka||)
kŏppuvaṭṭi ninnum̐ dīsi kŏsarīm̐ gūrimulĕllā
ippuḍe nīdoḍi nī kĕṁta garvamu
sĕppusu nem̐ ganusanna sesinām̐ dā nĕṟam̐gadu
sippila gaṭṭuvāyam̐ jesidivi nī vībĕnu

(||iṁka||)
gora gīri kām̐giliṁchi kusamula ninnu nŏtti
tārasillī; tana kĕṁtadaṁṭadanamu
seri ninnu nĕnasi sigguvarasinam̐ bodu
meralu śhrīveṁkaḍeśha mīriṁchidi vībĕnu