ఇంక నిన్ను దూరను యియ్యకొంటి నీ యానతి
(॥పల్లవి॥)
ఇంక నిన్ను దూరను యియ్యకొంటి నీ యానతి
కంకణము గట్టితి వీకాలమునాఁడే
(॥ఇంక॥)
యెన్ని లేవు విన్నపాలు యిట్టె సేసేనంటే నీకు
మన్నించినదే గురుతు మాకు నీవు
సన్నలు చాలుఁగలవు సారెఁ బాచారించేనంటె
వన్నెల మా యింటికి వచ్చుటే గురుతు
(॥ఇంక॥)
యెంతని చెప్పుదు మోహ మిట్టె నీకుఁ జూపెనంటే
యింతగా లాలించినదే యెక్కుడు నాకు
వంతుల కలివి యేది వాసులు వట్టేనంటే
చెంతనుండి నాతో పొందుసేసినదే గురుతు
(॥ఇంక॥)
యెక్కడ గొలఁది సేవలిట్టే నేఁ గావించేనంటే
యిక్కడ నన్నేలినదే యింపు నాకు
నెక్కొని శ్రీవేంకటేశ నీకు నే మొక్కేనంటే
లెక్క యేది నీ వేలినలీలలే గురుతు
(||pallavi||)
iṁka ninnu dūranu yiyyagŏṁṭi nī yānadi
kaṁkaṇamu gaṭṭidi vīgālamunām̐ḍe
(||iṁka||)
yĕnni levu vinnabālu yiṭṭĕ sesenaṁṭe nīgu
manniṁchinade gurudu māgu nīvu
sannalu sālum̐galavu sārĕm̐ bāsāriṁchenaṁṭĕ
vannĕla mā yiṁṭigi vachchuḍe gurudu
(||iṁka||)
yĕṁtani sĕppudu moha miṭṭĕ nīgum̐ jūbĕnaṁṭe
yiṁtagā lāliṁchinade yĕkkuḍu nāgu
vaṁtula kalivi yedi vāsulu vaṭṭenaṁṭe
sĕṁtanuṁḍi nādo pŏṁdusesinade gurudu
(||iṁka||)
yĕkkaḍa gŏlam̐di sevaliṭṭe nem̐ gāviṁchenaṁṭe
yikkaḍa nannelinade yiṁpu nāgu
nĕkkŏni śhrīveṁkaḍeśha nīgu ne mŏkkenaṁṭe
lĕkka yedi nī velinalīlale gurudu