Imka nemtagaa gaddo yimti nee javvanamu

ఇంక నెంతగా గద్దో యింతి నీ జవ్వనము
Language

(॥పల్లవి॥)
ఇంక నెంతగా గద్దో యింతి నీ జవ్వనము
వుంకువై వొక్కటొక్కటి కొనగూడె వలపు

(॥ఇంక॥)
చిక్కఁగా నీవు నవ్వితే చిత్తడిచెమట గారె
చెక్కునఁ జేయిపెట్టితే సిగ్గులు మూఁగె
నొక్కొన మాటాడితేను నిట్టూరుపులు రేఁగె
వొక్కటొక్కటే దొంతరై వొనగూడె వలపు

(॥ఇంక॥)
తప్పక చూచితేనే తతిగొనెఁ బులకలు
చిప్పిలఁ జెనకితేనే చింత రేఁగెను
వొప్పి సరసమాడితే వొడికట్టు వదలెను
వుప్పరాలై వొక్కటొక్క టొనగూడె వలపు

(॥ఇంక॥)
తనువులు మోచితేనే తతిగొనెఁ దమకము
పెనఁగితేఁ బ్రియములు పిక్కటిల్లెను
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలో నిన్నిన్నిటాను
వునికై వొకటొకటే వొనగూడె వలపు

(||pallavi||)
iṁka nĕṁtagā gaddo yiṁti nī javvanamu
vuṁkuvai vŏkkaḍŏkkaḍi kŏnagūḍĕ valabu

(||iṁka||)
sikkam̐gā nīvu navvide sittaḍisĕmaḍa gārĕ
sĕkkunam̐ jeyibĕṭṭide siggulu mūm̐gĕ
nŏkkŏna māḍāḍidenu niṭṭūrubulu rem̐gĕ
vŏkkaḍŏkkaḍe dŏṁtarai vŏnagūḍĕ valabu

(||iṁka||)
tappaga sūsidene tadigŏnĕm̐ bulagalu
sippilam̐ jĕnagidene siṁta rem̐gĕnu
vŏppi sarasamāḍide vŏḍigaṭṭu vadalĕnu
vupparālai vŏkkaḍŏkka ṭŏnagūḍĕ valabu

(||iṁka||)
tanuvulu mosidene tadigŏnĕm̐ damagamu
pĕnam̐gidem̐ briyamulu pikkaḍillĕnu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo ninninniḍānu
vunigai vŏgaḍŏgaḍe vŏnagūḍĕ valabu