Imka nemisesum jeli yimtagamtenu

ఇంక నేమిచేసుఁ జెలి యింతకంటెను
Language

(॥పల్లవి॥)
ఇంక నేమిచేసుఁ జెలి యింతకంటెను
కంకణాల చేతులెత్తి కడుమొక్కుచున్నది

(॥ఇంక॥)
నిలిచి నీవు చేసిన నేరము లెంచనొల్లక
నలినాక్షి వూరకె మోనాన నున్నది
వెలయ నిన్ను గద్దించి వేసరించనొల్లక
తళుకుఁజెక్కులతోడ తలవంచుకున్నది

(॥ఇంక॥)
గోమున వీ సతులను కోపించనొల్లక
లేమ పాన్పుపైఁ బవళించి వున్నది
ఆముకొన్ననీగుణాల కలుగఁగనొల్లక
నామువార సెలవుల నవ్వుకొంటా నున్నది

(॥ఇంక॥)
చెంగట నిన్ను రతుల సిగ్గువరచనొల్లక
అంగన యిట్టె పరాకై వున్నది
రంగుగఁ గూడితివి యీరామను శ్రీవేంకటేశ
పొంగుచు సంతోసానఁ బొగడుచు నున్నది

(||pallavi||)
iṁka nemisesum̐ jĕli yiṁtagaṁṭĕnu
kaṁkaṇāla sedulĕtti kaḍumŏkkusunnadi

(||iṁka||)
nilisi nīvu sesina neramu lĕṁchanŏllaga
nalinākṣhi vūragĕ monāna nunnadi
vĕlaya ninnu gaddiṁchi vesariṁchanŏllaga
taḽugum̐jĕkkuladoḍa talavaṁchugunnadi

(||iṁka||)
gomuna vī sadulanu kobiṁchanŏllaga
lema pānpubaim̐ bavaḽiṁchi vunnadi
āmugŏnnanīguṇāla kalugam̐ganŏllaga
nāmuvāra sĕlavula navvugŏṁṭā nunnadi

(||iṁka||)
sĕṁgaḍa ninnu radula sigguvarasanŏllaga
aṁgana yiṭṭĕ parāgai vunnadi
raṁgugam̐ gūḍidivi yīrāmanu śhrīveṁkaḍeśha
pŏṁgusu saṁtosānam̐ bŏgaḍusu nunnadi