ఇంక నీచిత్తము యెట్లనైనఁ గావుము
(॥పల్లవి॥)
ఇంక నీచిత్తము యెట్లనైనఁ గావుము
పొంకమాయ నాకు నీకు పొందులెల్లఁ దొలుతనె
(॥ఇంక॥)
తలఁపు నీ వెరుఁగుదువు తగవు నీకుఁ దెలుసును
మలసి విన్నవించనేల మాఁటిమాఁటికి
బలమిసేయనేఁటికి పరాకు నీకు లేదు
నిలిచి యేడనుండినా నీవారమే
(॥ఇంక॥)
వింటి నీగుణములు వెలసె నీచరితలు
జంట నాకు నీవు గలవు జరయవలవదు
అంటె నీమోహము ఆదియు నీప్రభావము
ఇంట నెపుడు నున్నాండ విదియ మాకులాభము
(॥ఇంక॥)
చనవు లిప్పు డొసఁగితివి సరసమునఁ జెనకితివి
పెనఁగఁదగదు నీవు నాకుఁ బ్రియుఁడవౌదువు
వినుమ అలమేల్ మంగవిభుఁడ శ్రీవేంకటేశ
తనివి రతుల మమ్ము నింత తగులుసేసుకొంటివి
(||pallavi||)
iṁka nīsittamu yĕṭlanainam̐ gāvumu
pŏṁkamāya nāgu nīgu pŏṁdulĕllam̐ dŏludanĕ
(||iṁka||)
talam̐pu nī vĕrum̐guduvu tagavu nīgum̐ dĕlusunu
malasi vinnaviṁchanela mām̐ṭimām̐ṭigi
balamiseyanem̐ṭigi parāgu nīgu ledu
nilisi yeḍanuṁḍinā nīvārame
(||iṁka||)
viṁṭi nīguṇamulu vĕlasĕ nīsaridalu
jaṁṭa nāgu nīvu galavu jarayavalavadu
aṁṭĕ nīmohamu ādiyu nīprabhāvamu
iṁṭa nĕbuḍu nunnāṁḍa vidiya māgulābhamu
(||iṁka||)
sanavu lippu ḍŏsam̐gidivi sarasamunam̐ jĕnagidivi
pĕnam̐gam̐dagadu nīvu nāgum̐ briyum̐ḍavauduvu
vinuma alamel maṁgavibhum̐ḍa śhrīveṁkaḍeśha
tanivi radula mammu niṁta tagulusesugŏṁṭivi