Imka nee talampuletlaano

ఇంక నీ తలఁపులెట్లానో
Language

(॥పల్లవి॥)
ఇంక నీ తలఁపులెట్లానో
మంకునకును నా మనసు గొలుపదు

(॥ఇంక॥)
నగి సరసమాడ నాలుక సమకొను
జగడాలడువఁగ సమకొనదు
మొగము చూచితే మొక్కును చేదోయి
తెగువలకైతే తెమలదు నాకు

(॥ఇంక॥)
నయమున నా చూపు ననుచును నీపై
భయపరచఁగ మరి పైకొనదు
ప్రియమునఁ బెనఁగఁగ పెరుగును చనుఁగవ
చేయి వదలదు నీ చెలువపు రతిని

(॥ఇంక॥)
జంకించవు నిను సారెకు బొమ్మలు
పొంకపు సన్నకుఁ బొదలీని
అంకెల శ్రీ వేంకటాధిప కూడితి
కంకిగ నలయదు కాయం బిదివో

(||pallavi||)
iṁka nī talam̐pulĕṭlāno
maṁkunagunu nā manasu gŏlubadu

(||iṁka||)
nagi sarasamāḍa nāluga samagŏnu
jagaḍālaḍuvam̐ga samagŏnadu
mŏgamu sūside mŏkkunu sedoyi
tĕguvalagaide tĕmaladu nāgu

(||iṁka||)
nayamuna nā sūbu nanusunu nībai
bhayabarasam̐ga mari paigŏnadu
priyamunam̐ bĕnam̐gam̐ga pĕrugunu sanum̐gava
seyi vadaladu nī sĕluvabu radini

(||iṁka||)
jaṁkiṁchavu ninu sārĕgu bŏmmalu
pŏṁkabu sannagum̐ bŏdalīni
aṁkĕla śhrī veṁkaḍādhiba kūḍidi
kaṁkiga nalayadu kāyaṁ bidivo