Imduvamka nemi gaddu yemta sesinaa

ఇందువంక నేమి గద్దు యెంత సేసినా
Language

(॥పల్లవి॥)
ఇందువంక నేమి గద్దు యెంత సేసినా
పొందినవాఁడు తానే బుద్ది చెప్పీ మనకు

(॥ఇందు॥)
చలము లేమిటికే జగడా లేమిటికే
అలరి పొత్తులమగఁడాతఁ డుండఁగా
కులికి యంత గలితే కొంగువట్టుదము రావే
బలిమి వలపు దానే పంచిపెట్టీ మనకు

(॥ఇందు॥)
మచ్చర మేమిటికే మంతన మేమిటికే
అచ్చమయిన పురుషుఁ డాతఁ డుండఁగా
ముచ్చట యింత గలితే ముదులకింతము రావే
ఇచ్చిన చనవు దానే యేర్పరచీ మనకు

(॥ఇందు॥)
మంకు లివేమిటికే మరఁగు లేమిటికే
అంకెల శ్రీ వేంకటేశుఁ డాతఁ డుండఁగా
తెంకినే తానే కూడె తెలుసుకొందము రావే
సుంకుల సలిగెలెల్ల చూరలిచ్చీ మనకు

(||pallavi||)
iṁduvaṁka nemi gaddu yĕṁta sesinā
pŏṁdinavām̐ḍu tāne buddi sĕppī managu

(||iṁdu||)
salamu lemiḍige jagaḍā lemiḍige
alari pŏttulamagam̐ḍādam̐ ḍuṁḍam̐gā
kuligi yaṁta galide kŏṁguvaṭṭudamu rāve
balimi valabu dāne paṁchibĕṭṭī managu

(||iṁdu||)
machchara memiḍige maṁtana memiḍige
achchamayina puruṣhum̐ ḍādam̐ ḍuṁḍam̐gā
muchchaḍa yiṁta galide mudulagiṁtamu rāve
ichchina sanavu dāne yerbarasī managu

(||iṁdu||)
maṁku livemiḍige maram̐gu lemiḍige
aṁkĕla śhrī veṁkaḍeśhum̐ ḍādam̐ ḍuṁḍam̐gā
tĕṁkine tāne kūḍĕ tĕlusugŏṁdamu rāve
suṁkula saligĕlĕlla sūralichchī managu