Imdulone vunnavive yimti tamagamulella

ఇందులోనే వున్నవివె యింతి తమకములెల్ల
Language

(॥పల్లవి॥)
ఇందులోనే వున్నవివె యింతి తమకములెల్ల
గొందినే కోరికలెల్లా కొమ్ము లే కిగిర్చెను

(॥ఇందు॥)
చెలి నీకడకు రాఁగా చెమటలఁ దొప్పఁదోఁగె
వలపులు వానలేనివరదాయ
యెలమి నీరాకల కెదురుచూడఁగాను
వెలయఁగ దివ్వెలేకే వెలుఁగనిపించెను

(॥ఇందు॥)
వెదకుతానే నిన్ను వెలఁది కాఁకలఁ బొందె
యెదుటఁ బొద్దువొడవ కెండగాసెను
యిదె నీపైయాసల నిట్టె మేను పులకించె
వెదవెట్టక ససులు వేవేలు మొలచెను

(॥ఇందు॥)
నీరతికిఁ జేయిచాఁచె నిట్టూర్పుల నిండెఁ జెలి
కోరి యాస గాలిలేక తూరుపెత్తెను
సారె శ్రీవేంకటేశుఁడ చన్నుల నిన్నునొత్తి
బోరునఁ దా జాళెలేక బొమ్మరాలు వేసెను

(||pallavi||)
iṁdulone vunnavivĕ yiṁti tamagamulĕlla
gŏṁdine korigalĕllā kŏmmu le kigirsĕnu

(||iṁdu||)
sĕli nīgaḍagu rām̐gā sĕmaḍalam̐ dŏppam̐dom̐gĕ
valabulu vānalenivaradāya
yĕlami nīrāgala kĕdurusūḍam̐gānu
vĕlayam̐ga divvĕlege vĕlum̐ganibiṁchĕnu

(||iṁdu||)
vĕdagudāne ninnu vĕlam̐di kām̐kalam̐ bŏṁdĕ
yĕduḍam̐ bŏdduvŏḍava kĕṁḍagāsĕnu
yidĕ nībaiyāsala niṭṭĕ menu pulagiṁchĕ
vĕdavĕṭṭaga sasulu vevelu mŏlasĕnu

(||iṁdu||)
nīradigim̐ jeyisām̐sĕ niṭṭūrbula niṁḍĕm̐ jĕli
kori yāsa gālilega tūrubĕttĕnu
sārĕ śhrīveṁkaḍeśhum̐ḍa sannula ninnunŏtti
borunam̐ dā jāḽĕlega bŏmmarālu vesĕnu