Imdulage veragayyee niddarim joosi naagu

ఇందులకే వెరగయ్యీ నిద్దరిఁ జూచి నాకు
Language

(॥పల్లవి॥)
ఇందులకే వెరగయ్యీ నిద్దరిఁ జూచి నాకు
కందువల మనసెట్టు గరఁగేవోకాని

(॥ఇందు॥)
వెలఁది గుట్టుమానిసి వేడుకకాఁడవు నీవు
బలిమిసేసి కొఁగేల పట్టేవోకాని
పలుకుఁ దేనెల దీకె, పంతపువాఁడవు నీవు
చెలరేఁగి పొందు లెట్టు సేసేవోకాని

(॥ఇందు॥)
కడుసిగ్గరిది యీకె గయ్యాళివాఁడవు నీవు
అడరి సరస మెట్లా నాడేవోకాని
కడఁగి కోమలి యీకె, గడుసువాఁడవు నీవు
జడియ నీ రతు లెట్టు జరపేవోకాని

(॥ఇందు॥)
యిచ్చకపుసతి యీకె యేలినవాఁడవు నీవు
నిచ్చాఁ గూడి యెట్లా మన్నించ్చేవోకాని
యిచ్చట నలమేల్ మంగ యీకె శ్రీవేంకటేశుఁడ
మెచ్చి పెండ్లాడితి వెంత మెరయించేవోకాని

(||pallavi||)
iṁdulage vĕragayyī niddarim̐ jūsi nāgu
kaṁduvala manasĕṭṭu garam̐gevogāni

(||iṁdu||)
vĕlam̐di guṭṭumānisi veḍugagām̐ḍavu nīvu
balimisesi kŏm̐gela paṭṭevogāni
palugum̐ denĕla dīgĕ, paṁtabuvām̐ḍavu nīvu
sĕlarem̐gi pŏṁdu lĕṭṭu sesevogāni

(||iṁdu||)
kaḍusiggaridi yīgĕ gayyāḽivām̐ḍavu nīvu
aḍari sarasa mĕṭlā nāḍevogāni
kaḍam̐gi komali yīgĕ, gaḍusuvām̐ḍavu nīvu
jaḍiya nī radu lĕṭṭu jarabevogāni

(||iṁdu||)
yichchagabusadi yīgĕ yelinavām̐ḍavu nīvu
nichchām̐ gūḍi yĕṭlā manniṁchchevogāni
yichchaḍa nalamel maṁga yīgĕ śhrīveṁkaḍeśhum̐ḍa
mĕchchi pĕṁḍlāḍidi vĕṁta mĕrayiṁchevogāni