ఇందుకు నీ చిత్త మిఁక నెట్టున్నదో
(॥పల్లవి॥)
ఇందుకు నీ చిత్త మిఁక నెట్టున్నదో
కందువ జోలిఁ బెట్టక కరుణించవయ్యా
(॥ఇందు॥)
తెరదీసి మోముచూచి తీపుమోవికే లాసి
సరసపుఁగాఁకల చలిగాసీని
తరుణి నీ కింతగాను తపములు చేసి చేసి
వెరవులు వెదుకుచు విరుల వేసీని
(॥ఇందు॥)
చేయివట్టి సన్నసేసి సిగ్గులెల్లాఁ గూడపెట్టి
దాయపు వలపులను దండగట్టీని
కాయజకేలికి నీకుఁ గమ్మటి వేడెలువెట్టి
ఆయములు ముట్టి ముట్టి యానలు వెట్టీని
(॥ఇందు॥)
కప్పురము నోరికిచిచి కాఁగిటిరతుల మెచ్చి
యిప్పుడే పానుపు మీద యెడమిచ్చీని
నెప్పున శ్రీవేంకటేశ నిన్ను నిన్నిటాఁ దచ్చి
చెప్పరానిచేఁతలెల్లాఁ జేసి హెచ్చీని
(||pallavi||)
iṁdugu nī sitta mim̐ka nĕṭṭunnado
kaṁduva jolim̐ bĕṭṭaga karuṇiṁchavayyā
(||iṁdu||)
tĕradīsi momusūsi tībumovige lāsi
sarasabum̐gām̐kala saligāsīni
taruṇi nī kiṁtagānu tabamulu sesi sesi
vĕravulu vĕdugusu virula vesīni
(||iṁdu||)
seyivaṭṭi sannasesi siggulĕllām̐ gūḍabĕṭṭi
dāyabu valabulanu daṁḍagaṭṭīni
kāyajageligi nīgum̐ gammaḍi veḍĕluvĕṭṭi
āyamulu muṭṭi muṭṭi yānalu vĕṭṭīni
(||iṁdu||)
kappuramu norigisichi kām̐giḍiradula mĕchchi
yippuḍe pānubu mīda yĕḍamichchīni
nĕppuna śhrīveṁkaḍeśha ninnu ninniḍām̐ dachchi
sĕpparānisem̐talĕllām̐ jesi hĕchchīni