Imdugemi dosamaa yeggulemche vimtalone

ఇందుకేమి దోసమా యెగ్గులెంచే వింతలోనె
Language

(॥పల్లవి॥)
ఇందుకేమి దోసమా యెగ్గులెంచే వింతలోనె
పొందుసేసినట్టివారు భోగింతురుగాక

(॥ఇందు॥)
సిగ్గులు పడుదురా సేవలు సేసేవారు
వెగ్గళించి నీపై జేయివేతురుగాక
వొగ్గి వూరకుండుదురా వొద్దనుండినట్టివారు
అగ్గలపుసరసము లాడుదురుగాక

(॥ఇందు॥)
మాఁటలాడకుండుదురా మనసులు గన్నవారు
యేఁటికై నా నిన్ను నేరా లెంతుగాక
నీటు చూపకుండుదురా నీసరిఁ గూచున్న వారు
మేఁటిరతులను మితిమీరుదురుగాక

(॥ఇందు॥)
అలమి కూడకుందురా ఆయములంటినవారు
చలపట్టి పాదములు చాఁతురుగాక
యెలమి శ్రీవేంకటేశ ఇద్దరిఁ గూడితి విట్టె
సొలసి నేర్పులు తోడు చూపుదురుగాక

(||pallavi||)
iṁdugemi dosamā yĕggulĕṁche viṁtalonĕ
pŏṁdusesinaṭṭivāru bhogiṁturugāga

(||iṁdu||)
siggulu paḍudurā sevalu sesevāru
vĕggaḽiṁchi nībai jeyivedurugāga
vŏggi vūraguṁḍudurā vŏddanuṁḍinaṭṭivāru
aggalabusarasamu lāḍudurugāga

(||iṁdu||)
mām̐ṭalāḍaguṁḍudurā manasulu gannavāru
yem̐ṭigai nā ninnu nerā lĕṁtugāga
nīḍu sūbaguṁḍudurā nīsarim̐ gūsunna vāru
mem̐ṭiradulanu midimīrudurugāga

(||iṁdu||)
alami kūḍaguṁdurā āyamulaṁṭinavāru
salabaṭṭi pādamulu sām̐turugāga
yĕlami śhrīveṁkaḍeśha iddarim̐ gūḍidi viṭṭĕ
sŏlasi nerbulu toḍu sūbudurugāga