ఇందుకెల్ల నాకుఁ జనవిచ్చితో లేదో
(॥పల్లవి॥)
ఇందుకెల్ల నాకుఁ జనవిచ్చితో లేదో
అందరు వినఁగ నాకు నానతియ్యవే
(॥ఇందు॥)
వెలఁది నావిన్నపము వింటివో లేదో యే -
పలుకైన నన్ను నిట్టె పాలింతువు
అలుకెంత గలిగిన నతనిమీఁదా నీ -
తలఁపున్న నిఁక నేమిఁ దడవకువే
(॥ఇందు॥)
కోమలి నాదండము చేకొంటివో లేదో ఆతఁ-
డేమనిని నవియెల్ల నిందుకొనవే
నీమది నింతగోపము నిలుపుదురా
యీమాఁట తనదేకా నెంచుమనెనే
(॥ఇందు॥)
నిచ్చలును నన్ను మన్నింతువో లేదో నేఁ-
డిచ్చటను శ్రీవేంకటేశుఁ గూడితి
మెచ్చితి రిద్దరు మీరు మీ నను యివి
తచ్చన లింతేకాక తగ్గుమొగ్గులా
(||pallavi||)
iṁdugĕlla nāgum̐ janavichchido ledo
aṁdaru vinam̐ga nāgu nānadiyyave
(||iṁdu||)
vĕlam̐di nāvinnabamu viṁṭivo ledo ye -
palugaina nannu niṭṭĕ pāliṁtuvu
alugĕṁta galigina nadanimīm̐dā nī -
talam̐punna nim̐ka nemim̐ daḍavaguve
(||iṁdu||)
komali nādaṁḍamu segŏṁṭivo ledo ādam̐-
ḍemanini naviyĕlla niṁdugŏnave
nīmadi niṁtagobamu nilubudurā
yīmām̐ṭa tanadegā nĕṁchumanĕne
(||iṁdu||)
nichchalunu nannu manniṁtuvo ledo nem̐-
ḍichchaḍanu śhrīveṁkaḍeśhum̐ gūḍidi
mĕchchidi riddaru mīru mī nanu yivi
tachchana liṁtegāga taggumŏggulā