Imduge pemdlaadidivi yerimgi mammu

ఇందుకే పెండ్లాడితివి యెరిఁగి మమ్ము
Language

(॥పల్లవి॥)
ఇందుకే పెండ్లాడితివి యెరిఁగి మమ్ము
చెంది మా వూడిగాలైనా జేకొనఁగవలదా

(॥ఇందు॥)
జలజాక్షితో నీవు సరసములాడి యాడి
అలసేవు కమ్మటిని అంతలోననే
వెలినున్న మాచేత విసరించుకొనరాదా
పలుమారు నేము సే సే పని యేమి నీకు

(॥ఇందు॥)
అప్పుడే యాపె పొత్తున ఆరగించి యారగించి
దప్పిఁ బొరలేవు కడుఁదమకమున
ఇప్పించుకొనరాదా వీడె మేతులకు మాచేత
వొప్పుగా నేమి చెప్పినా నోపమనేమా

(॥ఇందు॥)
సరిగా మీరిద్దరును సాములు చేసి చేసి
పొరలుచుఁ బానుపు పై బుసకొట్టేవు
బెరసి మమ్మేలితివి పిసికించుకొనరాదా
సిరుల శ్రీ వేంకటేశ సేవచేసే మిపుడు

(||pallavi||)
iṁduge pĕṁḍlāḍidivi yĕrim̐gi mammu
sĕṁdi mā vūḍigālainā jegŏnam̐gavaladā

(||iṁdu||)
jalajākṣhido nīvu sarasamulāḍi yāḍi
alasevu kammaḍini aṁtalonane
vĕlinunna māseda visariṁchugŏnarādā
palumāru nemu se se pani yemi nīgu

(||iṁdu||)
appuḍe yābĕ pŏttuna āragiṁchi yāragiṁchi
dappim̐ bŏralevu kaḍum̐damagamuna
ippiṁchugŏnarādā vīḍĕ medulagu māseda
vŏppugā nemi sĕppinā nobamanemā

(||iṁdu||)
sarigā mīriddarunu sāmulu sesi sesi
pŏralusum̐ bānubu pai busagŏṭṭevu
bĕrasi mammelidivi pisigiṁchugŏnarādā
sirula śhrī veṁkaḍeśha sevasese mibuḍu