Imdugaa needoradana mimdarilona

ఇందుకా నీదొరతన మిందరిలోన
Language

(॥పల్లవి॥)
ఇందుకా నీదొరతన మిందరిలోన
కందువల నిందు నేమి గట్టుకొంటివయ్యా

(॥ఇందు॥)
సెలవుల నే నవ్వితే శిరసువంచేవు నీవు
కలదా యేమైనాను కల్ల నీమేన
నిలువు నూరు వండీని నీవంక చూచితేను
తొలుసారే యేపనికి దొరకొంటివయ్యా

(॥ఇందు॥)
చేసన్న నేఁ జేసితేను సిగ్గులువడేవు నీవు
మూసి దించి నింద నీపై మోచెనా నేఁడు
ఆసఁ దేనె లుట్టిపడినట్టె నీతో మాటాడితే
వోసరించ కెంతవని కొడిగట్టితివయ్యా

(॥ఇందు॥)
కానుక నే నిచ్చితేను కాఁగిటఁ గూడేవు నీవు
వూని యిందుకే కాచుకున్నాఁడవో
ఆనుక శ్రీవేంకటేశ అలమేలుమంగను నేను
నీనేరుపు లెంతెంత నేరిచితివయ్యా

(||pallavi||)
iṁdugā nīdŏradana miṁdarilona
kaṁduvala niṁdu nemi gaṭṭugŏṁṭivayyā

(||iṁdu||)
sĕlavula ne navvide śhirasuvaṁchevu nīvu
kaladā yemainānu kalla nīmena
niluvu nūru vaṁḍīni nīvaṁka sūsidenu
tŏlusāre yebanigi dŏragŏṁṭivayyā

(||iṁdu||)
sesanna nem̐ jesidenu sigguluvaḍevu nīvu
mūsi diṁchi niṁda nībai mosĕnā nem̐ḍu
āsam̐ denĕ luṭṭibaḍinaṭṭĕ nīdo māḍāḍide
vosariṁcha kĕṁtavani kŏḍigaṭṭidivayyā

(||iṁdu||)
kānuga ne nichchidenu kām̐giḍam̐ gūḍevu nīvu
vūni yiṁduge kāsugunnām̐ḍavo
ānuga śhrīveṁkaḍeśha alamelumaṁganu nenu
nīnerubu lĕṁtĕṁta nerisidivayyā