ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవ
పల్లవి:
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట
చరణం 1:
నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా
ప్రేమ అనే కౌగిలిలో పెళ్లి అనే పందిరిలో
ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే
ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట
చరణం 2:
ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో
అరుదైన రుచులెన్నో అందించనా
విరితెనేలో తానమాడించానా
పరువమనే పల్లకిలో అందమనే బాలికలా
వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు
పిలిపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
pallavi:
iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste
sukkalage kulugŏchchiṁdaṁṭa sūryuḍige kunugŏchchiṁdaṁṭa
iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste
sūbulage palugŏchchiṁdaṁṭa jābilige naḍagŏchchiṁdaṁṭa
saraṇaṁ 1:
naḍireyi samayāna ŏḍiseru taruṇāna
nakṣhatra semaṁti jaḍalallanā
navvullo tŏlibuvvu ne gillanā
prema ane kaugililo pĕḽli ane paṁdirilo
ichchibuchchugunna māḍa maṁtramāyane
iddarŏkkaḍaina pāḍa manugaḍāyane
iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste
sūbulage palugŏchchiṁdaṁṭa jābilige naḍagŏchchiṁdaṁṭa
saraṇaṁ 2:
ārāru ṛtuvullo aṁdāla madhuvullo
arudaina rusulĕnno aṁdiṁchanā
viridĕnelo tānamāḍiṁchānā
paruvamane pallagilo aṁdamane bāligalā
vālu kanula valubu ganula nīli mĕrubulu
pilibulevo melugolibe ī uṣhassulo
iṁdradhanassu sīra kaṭṭi saṁdravadana seravaste
sukkalage kulugŏchchiṁdaṁṭa sūryuḍige kunugŏchchiṁdaṁṭa