ఇందరు నెరిఁగినవి యీ పనులు
(॥పల్లవి॥)
ఇందరు నెరిఁగినవి యీ పనులు
పొందులెల్లా నీడేరె బోగించఁగదవే
(॥ఇంద॥)
కొనచూపుల నవిగో కొసరులు
వొనరె ముక్కున నసురుసురులు
మునుకొనెఁ జెమటల ముసురులు
తనిసి రతి చిన్నలు దాఁచ నిఁకనేఁటికే
(॥ఇంద॥)
మోవిపై నవె నవ్వుల మొరఁగులు
కావరపు మనసులో కరఁగులు
తేవలఁ గొప్పు జారిన తెరఁగులు
చేవఁదేరెఁ బను లిఁక సిగ్గువడనేఁటికే
(॥ఇంద॥)
గుబ్బలపై నిండె నవె గుఱుతులు
గుబ్బి పచ్చి మాఁటల కఱతలు
గొబ్బున శ్రీవేంకటేశు కూటములు
అబ్బె నీకు యీచేఁత లడఁచఁగనేఁటికే
(||pallavi||)
iṁdaru nĕrim̐ginavi yī panulu
pŏṁdulĕllā nīḍerĕ bogiṁcham̐gadave
(||iṁda||)
kŏnasūbula navigo kŏsarulu
vŏnarĕ mukkuna nasurusurulu
munugŏnĕm̐ jĕmaḍala musurulu
tanisi radi sinnalu dām̐sa nim̐kanem̐ṭige
(||iṁda||)
movibai navĕ navvula mŏram̐gulu
kāvarabu manasulo karam̐gulu
tevalam̐ gŏppu jārina tĕram̐gulu
sevam̐derĕm̐ banu lim̐ka sigguvaḍanem̐ṭige
(||iṁda||)
gubbalabai niṁḍĕ navĕ guṟudulu
gubbi pachchi mām̐ṭala kaṟadalu
gŏbbuna śhrīveṁkaḍeśhu kūḍamulu
abbĕ nīgu yīsem̐ta laḍam̐sam̐ganem̐ṭige