Imdaru nee peddarigaa leṟumgudure

ఇందరు నీ పెద్దరికా లెఱుఁగుదురే
Language

(॥పల్లవి॥)
ఇందరు నీ పెద్దరికా లెఱుఁగుదురే
సందడి సరసమాడ చలమరి వౌదువే

(॥ఇంద॥)
చెంతనుండి యంటిముట్టి సేవలెల్లాఁ జేసేవు
యెంతచనవరివే యీతనికిని
బంతినుండి కూరల పలుచువులు చెప్పేవు
కాంతునిపై ఇంత బత్తిగలదాన వౌదువే

(॥ఇంద॥)
వట్టివేసాలఁ బూసుక వాసుక వచ్చే వీతని
కట్టు నిట్టుఁ జుట్టమవు నౌదువే నీవు
ట్టబయలు నడుమఁ బలుమారు మురిసేవు
బిట్టువాగెలఁ బెండ్లిపేరటాల నౌదువే

(॥ఇంద॥)
కందువఁ బాన్పుపై నుండి కాఁపురాలు సేసేవు
చెంది దేవులతము చెల్లువే నీకు
ఇందునే వేంకటేశుఁ డేలె నను నీకతాన
పందెమా డీతని నింతపనిగొంటి వౌదువే

(||pallavi||)
iṁdaru nī pĕddarigā lĕṟum̐gudure
saṁdaḍi sarasamāḍa salamari vauduve

(||iṁda||)
sĕṁtanuṁḍi yaṁṭimuṭṭi sevalĕllām̐ jesevu
yĕṁtasanavarive yīdanigini
baṁtinuṁḍi kūrala palusuvulu sĕppevu
kāṁtunibai iṁta battigaladāna vauduve

(||iṁda||)
vaṭṭivesālam̐ būsuga vāsuga vachche vīdani
kaṭṭu niṭṭum̐ juṭṭamavu nauduve nīvu
ṭṭabayalu naḍumam̐ balumāru murisevu
biṭṭuvāgĕlam̐ bĕṁḍliberaḍāla nauduve

(||iṁda||)
kaṁduvam̐ bānpubai nuṁḍi kām̐purālu sesevu
sĕṁdi devuladamu sĕlluve nīgu
iṁdune veṁkaḍeśhum̐ ḍelĕ nanu nīgadāna
paṁdĕmā ḍīdani niṁtabanigŏṁṭi vauduve