Imdaroo nerimginamdu kimta yemtige

ఇందరూ నెరిఁగినందు కింత యేఁటికే
Language

(॥పల్లవి॥)
ఇందరూ నెరిఁగినందు కింత యేఁటికే
అందమైన నీ గుణము లవి నాకు వింతా

(॥ఇంద॥)
సరసమాడేవారితో జగడా లడువనేల
తరవాత నాడేజాణతనాలేకాక
తెరమఱఁగుకు రమ్మా తెట్టఁదెరువుననేల
గొరబైనమాటలెలా గుదిగుచ్చవలెనా

(॥ఇంద॥)
సేసవెట్టే వారితో సిగ్గునఁ బెనఁగ నేల
వాసులతోడ శిరసువంచుటగాక
యీసరుసఁ గూచుండుమా యీడానాడాఁ బంతమేల
బాసలుసేసినవెల్లా బచారించవలెనా

(॥ఇంద॥)
పొందుసేసేవారితో బూటకా లేమినేల
సందుకొని రతికిఁ జేఇ చాఁచుటగాక
ముందె శ్రీవేంకటేశ మోహాన నన్నేలితివి
సందడిడే లిట్టె సారెఁ బట్టవలెనా

(||pallavi||)
iṁdarū nĕrim̐ginaṁdu kiṁta yem̐ṭige
aṁdamaina nī guṇamu lavi nāgu viṁtā

(||iṁda||)
sarasamāḍevārido jagaḍā laḍuvanela
taravāda nāḍejāṇadanālegāga
tĕramaṟam̐gugu rammā tĕṭṭam̐dĕruvunanela
gŏrabainamāḍalĕlā gudiguchchavalĕnā

(||iṁda||)
sesavĕṭṭe vārido siggunam̐ bĕnam̐ga nela
vāsuladoḍa śhirasuvaṁchuḍagāga
yīsarusam̐ gūsuṁḍumā yīḍānāḍām̐ baṁtamela
bāsalusesinavĕllā basāriṁchavalĕnā

(||iṁda||)
pŏṁdusesevārido būḍagā leminela
saṁdugŏni radigim̐ jei sām̐suḍagāga
muṁdĕ śhrīveṁkaḍeśha mohāna nannelidivi
saṁdaḍiḍe liṭṭĕ sārĕm̐ baṭṭavalĕnā