(॥పల్లవి॥)
ఇందరిలోనానైతే యేమనీ నాపె
కందువ నడుగరాదా కానుకలిచ్చీని
(॥ఇంద॥)
వొరసివొరసి నీవు వొకటొకటాడఁగాను
శిరసువంచుక చెలిసిగ్గువడీని
గరిసించ యీడనేల కాంక్ష నీకుఁ గలితేను
తెరలోనికేఁగరాదా తెలిపిచెప్పితిని
(॥ఇంద॥)
నడమనడుమ నీవు నవ్వులెల్లా నవ్వఁగాను
చిడుముడితో నాపె సిగ్గువడీని
పెడరేఁచ నిఁ(నిం?) తయేలప్రియము నుండితేను
వడిఁ బాన్పు చేరరాదావన్నెలు సేసీని
(॥ఇంద॥)
చెలఁగిచెలఁగి నీవు చేఁతలెల్లాఁ జేయఁగాను
జిలిబిలితనముతో సిగ్గువడీని
వలపు నీకు గలితే కలసి శ్రీవేంకటేశ
తలుపు మూసుకోరాదా దైవారీఁ బనులు
(||pallavi||)
iṁdarilonānaide yemanī nābĕ
kaṁduva naḍugarādā kānugalichchīni
(||iṁda||)
vŏrasivŏrasi nīvu vŏgaḍŏgaḍāḍam̐gānu
śhirasuvaṁchuga sĕlisigguvaḍīni
garisiṁcha yīḍanela kāṁkṣha nīgum̐ galidenu
tĕralonigem̐garādā tĕlibisĕppidini
(||iṁda||)
naḍamanaḍuma nīvu navvulĕllā navvam̐gānu
siḍumuḍido nābĕ sigguvaḍīni
pĕḍarem̐sa nim̐(niṁ?) tayelapriyamu nuṁḍidenu
vaḍim̐ bānpu serarādāvannĕlu sesīni
(||iṁda||)
sĕlam̐gisĕlam̐gi nīvu sem̐talĕllām̐ jeyam̐gānu
jilibilidanamudo sigguvaḍīni
valabu nīgu galide kalasi śhrīveṁkaḍeśha
talubu mūsugorādā daivārīm̐ banulu