ఇందరిలో సిగ్గయ్యా నీమాట నాకు
(॥పల్లవి॥)
ఇందరిలో సిగ్గయ్యా నీమాట నాకు
అంది ఇది యెంతజూటు అనేవు సుమ్మీ
(॥॥)
వలచిననీతో వడిగా మాటలాడుదు
తళుకుఁగన్నుల నిన్నుఁ దప్పక చూతు
బలిమి సేసి యట్టె పాదాలఁ బెనఁగుదు
అలరి ఇదెంత రట్టడనేవు సుమ్మీ
(॥॥)
నలిరేఁగి వేడుకలో నవ్వు నీతో నవ్వుదు
చలపట్టి నీమోవి చవిగొందును
కలువల వేసి నిన్నుఁ గాఁగిలించుకొందును
అలరి ఇదెంతదంటయని నన్ననుకుమీ
(॥॥)
సారె సారె నీ మేను చనుఁగవ నొత్తుదును
కూరిమి రతుల నిన్నుఁ గూడుదును
యీరీతి శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
గారవించి నన్నాసోదకత్తె యిదనుకుమీ
(||pallavi||)
iṁdarilo siggayyā nīmāḍa nāgu
aṁdi idi yĕṁtajūḍu anevu summī
(||||)
valasinanīdo vaḍigā māḍalāḍudu
taḽugum̐gannula ninnum̐ dappaga sūdu
balimi sesi yaṭṭĕ pādālam̐ bĕnam̐gudu
alari idĕṁta raṭṭaḍanevu summī
(||||)
nalirem̐gi veḍugalo navvu nīdo navvudu
salabaṭṭi nīmovi savigŏṁdunu
kaluvala vesi ninnum̐ gām̐giliṁchugŏṁdunu
alari idĕṁtadaṁṭayani nannanugumī
(||||)
sārĕ sārĕ nī menu sanum̐gava nŏttudunu
kūrimi radula ninnum̐ gūḍudunu
yīrīdi śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
gāraviṁchi nannāsodagattĕ yidanugumī