ఇందరి ముందరా నీవు యెంత సేసేవు
(॥పల్లవి॥)
ఇందరి ముందరా నీవు యెంత సేసేవు
కందువైన యేకతానఁ గరుణించరాదా
(॥ఇంద॥)
ముసి ముసి నవ్వులతో మోహన నుండినదాని
కొసరి కొసరి యేల కొంగువట్టేవు
కసుఁగాటు సిగ్గుతోటి కాంత నలయింతురా
యెసగి వొయ్యనే వీడెమిచ్చీఁగాక
(॥ఇంద॥)
చెక్కుల చెమటతోడ శిరసు వంచినదాని
కక్కసించి యిప్పడేమి కాలు దొక్కేవు
పక్కనను గుట్టుతోడి భామను ఱట్టుసేతురా
గక్కనఁ దానే వూడిగము సేసీఁగాక
(॥ఇంద॥)
చనుఁగవ భారముతో సరసమాడేటి దాని
పెనఁగి కాఁగిట నెంత బిగియించేవు
ననిచి శ్రీవేంకటేశ నాతి నింత పైకొందురా
యెనసి రతుల నిన్ను నిఁ(విం?) కా మెప్పించీఁగాక
(||pallavi||)
iṁdari muṁdarā nīvu yĕṁta sesevu
kaṁduvaina yegadānam̐ garuṇiṁcharādā
(||iṁda||)
musi musi navvulado mohana nuṁḍinadāni
kŏsari kŏsari yela kŏṁguvaṭṭevu
kasum̐gāḍu siggudoḍi kāṁta nalayiṁturā
yĕsagi vŏyyane vīḍĕmichchīm̐gāga
(||iṁda||)
sĕkkula sĕmaḍadoḍa śhirasu vaṁchinadāni
kakkasiṁchi yippaḍemi kālu dŏkkevu
pakkananu guṭṭudoḍi bhāmanu ṟaṭṭusedurā
gakkanam̐ dāne vūḍigamu sesīm̐gāga
(||iṁda||)
sanum̐gava bhāramudo sarasamāḍeḍi dāni
pĕnam̐gi kām̐giḍa nĕṁta bigiyiṁchevu
nanisi śhrīveṁkaḍeśha nādi niṁta paigŏṁdurā
yĕnasi radula ninnu nim̐(viṁ?) kā mĕppiṁchīm̐gāga