Imdari mumdara valabela daamsevu nee

ఇందరి ముందర వలపేల దాఁచేవు నీ
Language

(॥పల్లవి॥)
ఇందరి ముందర వలపేల దాఁచేవు నీ-
చందము లెఱుఁగుదురు సకులెల్లాను

(॥ఇంద॥)
లేకలేమి నా(వా?) సేవే లేటినేమి దువ్వేవే
వాకిటికి రమణుఁడు వచ్చి వుండఁగా
కాకుగా నెంత నవ్వేవే కతలెన్ని చెప్పేవే
పైకొని పన్నీటను పాదాలు గడుగవే

(॥ఇంద॥)
శిరసేల వంచేవే సిగ్గులెంత చూపేవే
సరస మాతఁడు నీతో సారె నాడఁగా
సరులెన్ని గట్టేవే జాగులేల లెరపేవే
పరగఁ గప్పురముతో బాగా లొసఁగవే

(॥ఇంద॥)
కొప్పెందాఁకాఁ బెట్టేవే గుట్టు నీవెంత చూపేవే
కప్పి శ్రీవేంకటిశుఁడు కాఁగిలించఁగా
చిప్పితి యెంత చొక్కేవే చెమటెంత గురిసేవే
విప్పుచు మోవితేనెల విందు వెట్టవే

(||pallavi||)
iṁdari muṁdara valabela dām̐sevu nī-
saṁdamu lĕṟum̐guduru sagulĕllānu

(||iṁda||)
legalemi nā(vā?) seve leḍinemi duvveve
vāgiḍigi ramaṇum̐ḍu vachchi vuṁḍam̐gā
kāgugā nĕṁta navveve kadalĕnni sĕppeve
paigŏni pannīḍanu pādālu gaḍugave

(||iṁda||)
śhirasela vaṁcheve siggulĕṁta sūbeve
sarasa mādam̐ḍu nīdo sārĕ nāḍam̐gā
sarulĕnni gaṭṭeve jāgulela lĕrabeve
paragam̐ gappuramudo bāgā lŏsam̐gave

(||iṁda||)
kŏppĕṁdām̐kām̐ bĕṭṭeve guṭṭu nīvĕṁta sūbeve
kappi śhrīveṁkaḍiśhum̐ḍu kām̐giliṁcham̐gā
sippidi yĕṁta sŏkkeve sĕmaḍĕṁta guriseve
vippusu movidenĕla viṁdu vĕṭṭave